Sam ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Samantha: ఇప్పుడన్ని వదిలేసా.. సంతోషంగా ఉన్నా.. సమంత సంచలన కామెంట్స్

Samantha: హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు తెలుగు సినీ అభిమానులకు సుపరిచితం. ‘ఏ మాయ చేశావే’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి స్టార్‌డమ్ సంపాదించింది.

Also Read: Kambalapalli Lake: గుట్టల నడుమ కాకతీయులనాటి కంబాలపల్లి చెరువు.. దీని ప్రత్యేకత తెలుసుకోవాల్సిందే!

ఈ బ్యూటీ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అదే సమయంలో తమిళ సినిమాల్లోనూ నటించి అక్కడ కూడా తనదైన ముద్ర వేసింది. కానీ, ఆమె పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు పడింది. నాగ చైతన్యను ప్రేమ పెళ్లి చేసుకున్న సమంత, కొన్ని తీవ్రమైన విభేదాల తర్వాత విడాకులు తీసుకుంది.

Also Read: H-City Project: హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్.. రూ.5942 కోట్లతో కొత్త రోడ్ ప్రాజెక్టులు ప్రారంభం

సౌత్ స్టార్ సమంత తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె తన జీవితంలో మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడిన అనుభవం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని వెల్లడించారు. ఒకప్పుడు సినిమా విజయాలు, బాక్సాఫీస్ సంఖ్యలు, టాప్-10 హీరోయిన్స్ జాబితాలో ఉండటమే తన లక్ష్యంగా ఉండేదని, కానీ ఇప్పుడు అవన్నీ తనకు పట్టడం లేదని సమంత సంచలన కామెంట్స్ చేసింది. “రెండేళ్లుగా నేను సినిమాలు చేయలేదు, టాప్-10 లిస్ట్‌లో కూడా లేను, అలాగే నా చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్‌లో కూడా లేవు. అయినా, నేను ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నాను,” అని ఆమె ఆత్మవిశ్వాసంతో అన్నారు. అంతక ముందు ప్రతి శుక్రవారం తన సినిమా హిట్ కావాలని ఆందోళన పడ్డా, తన ఆత్మగౌరవం బాక్సాఫీస్ గణాంకాల చుట్టూ తిరిగేదని, కానీ ఇప్పుడు తన దృష్టి మొత్తం పూర్తిగా మారిపోయిందని తెలిపారు.

Also Read: Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్

ప్రస్తుతం సమంత తన ఫాలోవర్స్ కోసం ఆరోగ్యంపై దృష్టి సారించిన హెల్త్ పాడ్‌కాస్ట్‌లు చేస్తున్నారు, దీని ద్వారా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే, ఆమె ఇప్పుడు ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలో ఆడియెన్స్ ముందుకు రానుంది. సమంత ఈ కామెంట్స్‌తో తన జీవితంలో కొత్త ప్రాధాన్యతలను, సంతోషాన్ని ఎలా కనుగొన్నారో చూపించారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Just In

01

FRS: తెలంగాణలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు కీలక అప్‌డేట్!

Bellamkonda Sai Sreenivas: ‘కిష్కింధపురి’ చూసిన వారంతా.. ఏం అడుగుతారంటే?

Trance of OMI: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుంచి ‘ఓమి ట్రాన్స్’ విడుదల.. ఎలా ఉందంటే?

Kavitha: కవితను కలిసిన కేసీఆర్ సొంతూరి ప్రజలు.. ఎందుకో తెలుసా?

Viral News: కారులోంచి దూకి ప్రియుడు మృతి.. అసలేం జరిగిందో తెలిస్తే షాక్