Bihar Elections 2025: బీహార్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ లీడర్లు
Bihar Elections 2025 ( IMAGE credit: twiter)
Political News

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ లీడర్లు.. సెలక్షన్ ప్రాసెస్ షురూ

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నుంచి ఓ ప్రత్యేక టీమ్ వెళ్లనున్న ది. ఇందులో కార్పొరేషన్ చైర్మన్లు, స్పోక్స్ పర్సన్లు, ఇతర ముఖ్య నాయకులు ఉండనున్నారు. సుమారు 50 మందికి పైగా పంపించేందుకు రాష్ట్ర పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులోనూ బీసీ నేతలనే ఎంపిక చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే టీ పీసీసీలో సెలక్షన్ ప్రాసెస్ మొదలైంది. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజలను ప్రభావితం చేయగలిగే లీడర్లను ఎంపిక చేయనున్నారు. గతంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నాయకులంతా వర్క్ చేశారు. ప్రచారంతో పాటు సమన్వయం,ఓటర్లతో అవగాహన కార్యక్రమాలు వంటివి నిర్వహించారు. ఇప్పుడు బీహార్ లోనూ వర్క్ చేయాలని ఏఐసీసీ ఆదేశించడంతో టీమ్ రెడీ అవుతున్నది.’

  Also Read: Karishma Kapoor: సంజయ్ కపూర్ ఆస్తి వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. వారసత్వంపై అనుమానాలు!

బీసీ రిజర్వేషన్లపై ప్రచారం…

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ప్రాసెస్ పూర్తి చేసినా..కేంద్రం మోకా లడ్డు వేసిందని బీహార్ లో ప్రచారం చేయనున్నారు. ఇక్కడ అమలు చేస్తున్న స్కీమ్స్, కార్యక్రమాలను వివరించనున్నారు. బీహార్ లో బీసీ నినాదాన్ని హైలెట్ చేయడం వలన తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది. దీనిలో భాగంగానే బీసీ నేతలను సెలక్టు చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నా యి. తెలంగాణ 42 శాతం అమలు కోసం కాంగ్రెస్ అనుసరించిన విధానాలను పబ్లిక్ కు స్పష్టంగా చెప్పనున్నారు. దీంతో పాటు ఓట్ చోరీపై వివరిస్తూ బీజేపీని టార్గెట్ చేయనున్నారు.

 Also Read: Daggubati Brothers: విచారణకు హాజరుకాని దగ్గుబాటి బ్రదర్స్.. కోర్టు సీరియస్​

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!