telusu-kada( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Telusu Kada Teaser: సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా టీజర్ వచ్చేసింది.. చూడాలంటే ‘తెలుసు కదా’?

Telusu Kada Teaser: టాలీవుడ్‌లో యూత్ సెన్సేషన్‌గా మారిన సిద్దు జొన్నలగడ్డ మరోసారి ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ‘తెలుసు కదా’ అనే లేటెస్ట్ చిత్రంతో స్క్రీన్‌పైకి రానున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు. ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఈ యువ హీరో, తన కెరీర్‌లో మరో మైలురాయిని నెలకొల్పుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా తొలిసారి పరిచయమయ్యే ఈ చిత్రం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్లల నిర్మాణంలో రూపొందుతోంది.

Read also-Asia Cup 2025: భారత్ – పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?

‘తెలుసు కదా’ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇది యూత్‌లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిత్ర యూనిట్ సూచించినట్టు, కథలో పూర్తిగా కొత్త కథాంశం ఉంటుంది, ఇది యువతను ఆకర్షించేలా రూపొందించబడింది. హీరోయిన్‌గా రాశీ ఖన్నా, KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్రలో మెరిసనున్నాడు. సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన ట్యూన్స్, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి (జాతీయ అవార్డు విజేత) ఎడిటింగ్‌తో ఈ చిత్రం హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌లో నిర్మించబడుతోంది. అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ వంటి టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ కూడా ఈ సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
Read also-Bellamkonda Sreenivas: వారికి బెల్లంకొండ బంపర్ ఆఫర్.. రైటర్స్ రెడీగా ఉండండి

టీజర్‌ను చూస్తుంటే.. ఈ సినిమా మొత్తం రొమేంటిక్ సీన్లతో నిండి ఉదని తెలుస్తోంది. హీరో ఇద్దరు అమ్మాయిల ప్రేమలో ఓకే సారి పడితే ఎలా ఉంటుంతో ఇందులో బాగా చూపించారు. ఈ ఇద్దరు అమ్మాయిలను పడగొట్టడానికి హీరో చెప్పే మాటలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ‘70 % ఏంజల్, 30 % డెవిల్ నువ్వు’ అంటూ ఒక హీరోయిన్ కోసం, ‘మీరు వవ్వుతుంటే ఇక్కడ వెదర్ డిస్టబెన్స్ అవుతోంది నాకు’ అనే డైలాగులు బాగా ఆకట్టుకునే లా ఉన్నాయి. హీరో హీరోయన్ల మధ్య జరిగే రొమాంటిక్ సీన్స్ బాగా హైలెట్ అవుతున్నాయి. ఈ సినిమా యువతను టార్గెట్ చేసే సినిమాలా అనిపిస్తుంది. ఏదీ ఏమైతేనే ఈ టీజర్ ను చూస్తుంటే చాలా బాగా కుదిరిట్లు అనిపిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 17 తేదీన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా కోసం సిద్దు జొన్నలగడ్డ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Viral News: కారులోంచి దూకి ప్రియుడు మృతి.. అసలేం జరిగిందో తెలిస్తే షాక్

YS Sharmila: నా బిడ్డ రాజకీయాల్లోకి వస్తే.. వైసీపీకి ఎందుకంత ఉలికిపాటు.. వైఎస్ షర్మిల

Warangal District: రజాకార్లపై విరోచితంగా పోరాడిన యోధుల గాధ.. స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం

Viral Video: బాత్రూం ఖాళీగా లేదా? ఈ పని చేయడానికి మెట్రోనే దొరికిందా!

only murders in the building season 5: కితకితలు పెట్టిస్తున్న థ్రల్లర్ సిరీస్.. ఎక్కడంటే?