Kishkindhapuri premiere review: ‘కిష్కింధపురి’ సినిమా రామాయణంలోని కిష్కింధ కాండం నుంచి ప్రేరణ పొందిన ఈ టైటిల్, భయం, మిస్టరీ సస్పెన్స్‌తో రూపొందుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను హారర్ థ్రిల్లర్ జానర్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో అనేక ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ సినిమా ప్రీమియర్ షోను హైదరాబాద్ లోని AAA ముల్టీప్లెక్స్ లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. సినిమా టాక్ ఎలా ఉందంటే.. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్న దర్శకుడు ఎప్పుడైతే కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెడతారో అక్కడ నుంచి సినిమాను పరిగెత్తిస్తూ భయపెట్టేసాడు. ఫస్టాఫ్ ను ఎటువంటి అదనపు హంగులకు వెళ్లకుండా అనుకున్న పాయింట్ ను తెరపై అంతే చక్కగా ప్రెసెంట్ చేశారు దర్శకుడు. ఇక సెకెండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్పింగ్ గా హారర్ ఎలిమెంట్స్ ని ఎక్కడా తక్కువ చేయకుండా అదరగొట్టారు. తమిళ నటుడు శాండ నటన గూస్ బమ్స్ తెప్పిస్తాయి. అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. థ్రిల్లర్ ఎపిసోడ్స్ స్టోరీ నేరేషన్ చాలా బాగుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌండ్. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండింగ్ హారర్ సినిమాను సౌండ్ తో ఎంత మ్యాజిక్ చేయచ్చో అంత చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే కిష్కింధపూరి మిమ్మల్ని భయపెడుతూ సీట్ ఎడ్జులో కూర్చోబెట్టి మరి అలరిస్తుంది. పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ చాలా బాగుంది.
Read also-Bathukamma 2025: తెలంగాణ పూల జాతర వచ్చేసింది.. ఈ ఏడాది బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే!
ఓ సందర్భంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా గురించి ఇలా మాట్లాడారు.. ‘ఈ సినిమా పది నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ పట్టకుంటే మళ్లీ సినిమాల్లో కనిపించను’ అని అన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. ఈ సినిమాకు అంత సీను ఉందా అంటూ నెటిజన్లు కామెంట్లకు సమాధానం దొరికింది. అయితే ఇదంతా టీంకి సినిమాపై ఉన్న నమ్మకమే అంటూ కొందరు మద్ధతు ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన కొందరు మంచిగా ఉందంటూ కితాబిస్తున్నారు. అయితే బెల్లంకొండ కెరీర్ లో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ఫస్ట్ గ్లింప్స్ విడుదలై, సోషల్ మీడియాలో భారీ బజ్ రేపాయి. సినిమా టైటిల్ ‘కిష్కింధపురి’ రామాయణంలోని వానరుల రాజ్యాన్ని గుర్తుచేస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన వరల్డ్‌ను సృష్టించి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవారు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.