Army Recruitment Rally: హనుమకొండలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఆన్ లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నవంబర్ 10-23 తేదీల ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగనున్నట్లు స్పష్టం చేశారు. రిక్రూట్ మెంట్ ప్రక్రియపై చర్చిచేందుకు బుధవారం (సెప్టెంబర్ 10) హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కల్నల్ సునీల్ యాదవ్ మాట్లాడుతూ ఆర్మీలో అగ్ని వీర్ నియామకాల కోసం గతేడాది హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించినట్లు చెప్పారు. ఈసారి హనుమకొండ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: CM Chandrababu: కొత్త పథకం ప్రకటించిన చంద్రబాబు.. దసరా నుంచే అమలు.. ఖాతాల్లోకి రూ.15 వేలు!
ఈసారి 9వేల మంది వరకు అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని కల్నల్ సునీల్ యాదవ్ తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రన్నింగ్, శారీరక సామర్థ్య పరీక్షలు, మెడికల్ టెస్ట్, విద్యార్హతల ధ్రువ పత్రాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 10 నుండి 23వ తేదీ వరకు జరగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తోడ్పాటునందించాలని కోరారు. స్టేడియంలో ట్రాక్ తో పాటు బారికేడ్లు, టెంట్లు, షామియానాలు, విద్యుద్దీపాలు, సీసీ కెమెరాలు, జనరేటర్, మొబైల్ టాయిలెట్స్, తాగునీరు, తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. వీటితో పాటు పోలీస్ బందోబస్తు, మెడికల్ టీం, అగ్నిమాపక, 108 వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
Also Read: MLA Raja Singh: కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాజాసింగ్.. బీజేపీ మీవల్లే నాశనమైదంటూ..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ నవంబర్ 10 నుండి 23వ తేదీ వరకు జరగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి వివిధ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు సహాయసహకారాలు అందిస్తారని స్ఫష్టం చేశారు. ఇదిలా ఉంటే ఆన్ లైన్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇప్పటికే ఫిట్ నెస్ పరీక్షల కోసం సన్నాద్దమవుతున్నారు. గ్రౌండ్ లో ఎలాగైన సత్తా చాటి.. ఆర్మీలో చేరాలని పట్టుదలగా ఉన్నారు.