MLA Raja Singh (image Source: Twitter)
తెలంగాణ

MLA Raja Singh: కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాజాసింగ్.. బీజేపీ మీవల్లే నాశనమైదంటూ..

MLA Raja Singh: తెలంగాణ బీజేపీ నాయకత్వంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోమారు మాటల తూటాలు పేల్చారు. రాష్ట్రంలో బీజేపీని నాశనం చేసే కుట్ర జరుగుతోందన్న ఆయన.. అసలైన కార్యకర్తలు అన్యాయమవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పార్టీలో నా మనిషి.. నీ మనిషి అన్న రాజకీయం నడుస్తోందని.. కొత్త కమిటీలో 12మంది ఒకే పార్లమెంటు సెగ్మెంట్ వాళ్లు ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు మంచి వ్యక్తి అయినప్పటికీ ఆయన రబ్బర్ స్టాంప్ అని రాజా సింగ్ అన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. కిషన్ రెడ్డి రాజీమనామా చేస్తే తాను చేస్తానని అన్నారు. ఎవరూ గెలుస్తారో చూసుకుందామంటూ వ్యాఖ్యానించారు. రాజాసింగ్ ఎప్పుడూ సింగిలే అని.. తన వెనుక ఎవరూ లేరని అన్నారు. అధికారంలోకి వచ్చే పార్టీని పండబెట్టారని విమర్శించారు. తనపై విమర్శలు చేసే అర్హత ప్రధాన కార్యదర్శి అశోక్ కు లేదని పేర్కొన్నారు.

Also Read: Viral Video: పులిని పట్టుకోని ఫారెస్ట్ అధికారులకు.. గ్రామస్థులు విచిత్రమైన శిక్ష!

బీజేపీలో కీలక నేతగా ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఈ ఏడాది జూన్ 30న పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధిష్టానానికి అందజేశారు. అధ్యక్షుడిగా నామినేషన్ వేసేందుకు వస్తే వేయనివ్వలేదని ఈ సందర్భంగా రాజాసింగ్ అన్నారు. అంతేకాదు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని రాజాసీంగ్ పలుమార్లు బహిరంగంగా తప్పుబట్టారు.

Also Read: CM Chandrababu: కొత్త పథకం ప్రకటించిన చంద్రబాబు.. దసరా నుంచే అమలు.. ఖాతాల్లోకి రూ.15 వేలు!

Just In

01

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే