Nagababu Family
ఎంటర్‌టైన్మెంట్

Nagababu: మెగా లిటిల్ ప్రిన్స్‌‌పై మెగా బ్రదర్ రియాక్షన్ ఇదే.. పట్టలేనంత ఆనందంలో!

Nagababu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. వారికి పండంటి బాబు జన్మించారు. బుధవారం లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు (Mega Little Prince) జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా షూటింగ్ మధ్య గ్యాప్‌లో వచ్చి, మెగా వారసుడిని చూసుకుని, మెగా ఆశీస్సులు అందించి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా సోషల్ మీడియా వేదికగా మెగా లిటిల్ వన్ అని చెప్పి బిడ్డతో ఉన్న ఫొటోని షేర్ చేశారు. ఈ ఫొటో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పుడు తాతగా ప్రమోషన్ పొందిన నాగబాబు వంతొచ్చింది.

Also Read- Chiranjeevi- Vijay Sethupathi: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సెట్‌కి అనుకోని అతిథి.. ఎందుకొచ్చారంటే?

లిటిల్ సింహానికి స్వాగతం

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా తన ఇంట్లోకి నూతనంగా వచ్చిన వారసుడిని కలుపుకుని మొత్తం ఫ్యామిలీ ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో మెగా డాటర్ నిహారిక కూడా ఉన్నారు. వరుణ్ తేజ్, లావణ్య, లిటిల్ ప్రిన్స్, నాగబాబు, పద్మజ, నిహారిక.. ఇలా వారి కుటుంబ పిక్‌ని షేర్ చేసిన నాగబాబు (Mega Brother Nagababu).. తన ఆనందాన్ని తెలియజేశారు. ‘‘నా ప్రియమైన బుజ్జి తండ్రి.. ఎంతో సున్నితంగా, నిశ్శబ్దంగా, అంతులేని ఆశలతో నువ్వు మంచు బిందువులా వచ్చావు. నీ కళ్ళలో, మా కుటుంబ భవిష్యత్ సూర్యోదయాన్ని చూస్తున్నాను. నా లిటిల్ సింహానికి స్వాగతం. నీ గర్జనతో నా హృదయంలోకి గుసగుసలాడుతూ వచ్చావు, నీతో పాటు, నీ చేయి పట్టుకొని నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను..’’ అంటూ నాగబాబు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూస్తుంటే ఆయన పట్టలేనంత సంతోషంలో ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఈ పోస్ట్‌కు నెటిజన్లు కూడా చాలా పాజిటివ్‌కు స్పందిస్తూ.. లిటిల్ ప్రిన్స్‌కు స్వాగతం పలుకుతున్నారు.

Also Read- Mega Little Prince: వారసుడిని చూసి మెగాస్టార్ కళ్లల్లో ఆనందం.. ఫొటోలు వైరల్!

చాలా హ్యాపీగా ఉంది

అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి.. సోషల్ మీడియా వేదికగా.. లావణ్య, వరుణ్ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారని చెబుతూ.. లిటిల్ ప్రిన్స్‌ని చూస్తు ఎంతో ఆనందంతో పొంగిపోతున్న ఫొటోని షేర్ చేశారు. ఆయన తన పోస్ట్‌లో.. ‘‘చిన్నారికి స్వాగతం! కొణిదెల కుటుంబంలోకి అడుగుపెట్టిన మా వారసుడికి హృదయపూర్వక స్వాగతం. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గర్వించదగిన తల్లిదండ్రులు అయినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాగబాబు, పద్మజ గర్వించదగిన తాత, నాయనమ్మలుగా పదోన్నతి పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. బిడ్డకు ఆనందం, మంచి ఆరోగ్యం, అంతులేని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. మీ ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ మా బిడ్డకు ఉండాలని ఆశిస్తున్నాము..’’ అని పేర్కొన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది