Chiranjeevi- Vijay Sethupathi: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’ శరవేగంగా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సెట్ లోకి అనుకొని అతిథి రావడంతో అక్కడ ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. వచ్చింది ఎవరంటే విజయ్ సేతుపతి. పూరీ జగన్నాథ్ కొత్త సినిమా ‘పూరి సేతుపతి’ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే పక్కనే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకుని సేతుపతి వెళ్లి కలిశారు. ఆయనతో పాటు మూవీ టీం కూడా ఉంది. వీరందరూ కలిసి సెట్ లో కొద్దిసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా వారంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. చిరంజీవిని ఆ లుక్ లో చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. చిరు ఈ సినిమాలో ముప్పైఏళ్లు వెనక్కి వెళ్లిపోయారంటూ కామెంట్లు పెడుతున్నరు. విజయ్ సేతుపతి మాస్ లుంగీ లుక్‌లో ఫుల్ ఎనర్జీగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Read also-CM Chandrababu: కొత్త పథకం ప్రకటించిన చంద్రబాబు.. దసరా నుంచే అమలు.. ఖాతాల్లోకి రూ.15 వేలు!
పూరీ జగన్నాథ్ తాజా చిత్రం ‘పూరి సేతుపతి’ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. విజయ్ సేతుపతి హీరోగా, సంయుక్త మెనన్ హీరోయిన్‌గా, టాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. కన్నడ స్టార్ దునియా విజయ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. చార్మి కౌర్ ప్రెజెంట్స్‌గా, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. జేబీ మోషన్ పిక్చర్స్‌తో కలిసి జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూలై 7, 2025 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం పూర్తి కాస్ట్‌తో హైదరాబాద్ షెడ్యూల్ వేగంగా సాగుతోంది. మేజర్ టాకీ పోర్షన్స్‌ను షూట్ చేస్తున్నారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి, సంయుక్తలు కలిసి కన్సిస్టెంట్ షూట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి ఇంతకు ముందు ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి తో నే కలిసి నటించారు. ఇప్పుడు మళ్లీ వీరి కలయిక సినిమా కోసమా లేక సామాన్యంగానే కలిశారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Read also-Mega Little Prince: వారసుడిని చూసి మెగాస్టార్ కళ్లల్లో ఆనందం.. ఫొటోలు వైరల్!
ఇక ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం గురించి చెప్పాలంటే, ఇది మెగాస్టార్ చిరంజీవి గారి 157వ సినిమా. డైరెక్టర్ అనిల్ రవిపూడి రూపొందిస్తున్నారు. చిరంజీవి గారి అసలు పేరు కొనిదెల శంకర వరప్రసాద్‌కు సంబంధించిన టైటిల్ ఇది. ట్యాగ్‌లైన్ ‘పండగకి వస్తున్నారు’. ఈ సినిమా కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. నయనతార హీరోయిన్‌గా, వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది చిరంజీవి, నయనతార కలిసి నటిస్తున్న మూడో చిత్రం. ఇంతకు ముందు వీరు ‘సైరా నరసింహారెడ్డి’, గాడ్ ఫాదర్ సినిమాల్లో కలిసి నటించారు. ఇది మూడవ చిత్రం. ప్రస్తుతం చిరంజీవి, నయనతారలతో ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో, కోరియోగ్రాఫీ విజయ్ పోలంకి చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2026కి రిలీజ్ కానుంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సహు గరపతి, సుష్మితా కొనిదల నిర్మిస్తున్నారు.