Daggubati Family Case (imagecredit:twitter)
తెలంగాణ

Daggubati Family Case: నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి సోదరులు.. హాజరు కాకపోతే నోటీసులు జారీ!

Daggubati Family Case: దక్కన్​ కిచెన్​ హోటల్​ కూల్చివేత కేసులో నేడు టాలీవుడ్​ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్(Venkatesh), దగ్గుబాటి రాణా(Rana)తోపాటు నిర్మాత దగ్గుబాటి సురేష్(Suresha)​, అభిరాంలు నాంపల్లి కోర్టుకు రానున్నారు. ఇప్పటికే కోర్టు ఆదేశాలతో ఈ నలుగురిపై ఫిలింనగర్ పోలీసులు ఐపీసీ 448, 452, 458, 120 బీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఫిలింనగర్​ లోని దక్కన కిచెన్​ హోటల్​ స్థలానికి సంబంధించి దాని యజమాని నందకుమార్​.. దగ్గుబాటి కుటుంబం మధ్య గతంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.

హైకోర్టు ఆదేశాలను లెక్క చేయలేదు..

ఈ నేపథ్యంలో నందకుమార్(Nandakumar)​ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. కాగా, 2022, నవంబర్​ లో జీహెచ్​ఎంసీ(GHMC) సిబ్బంది, బౌన్సర్లతో కలిసి వచ్చిన దగ్గుబాటి బ్రదర్స్ హోటల్​ ను పాక్షికంగా కూల్చి వేశారు. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయలేదు. ఇక, 2024, జనవరిలో మొత్తం హోటల్ ను కూల్చి వేశారు. దాంతో నందకుమార్(Nandakumar)​ వీరిపై కేసులు నమోదు చేయాలని నాంపల్లిలోని 17వ అదనపు ఛీఫ్​ మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​ కోర్టులో పిటిషన్​ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు హీరోలు దగ్గుబాటి వెంకటేశ్​, దగ్గుబాటి రాణా, నిర్మాత దగ్గుబాటి సురేశ్​, అభిరాంలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Viral Video: ఏనుగులనే హడలెత్తించిన.. డాడీ లిటిల్ ప్రిన్సెస్.. మీకో దండం తల్లి!

విచారణను సెప్టెంబర్​ 10కి వాయిదా..

ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులు(Filmnagar Police) కేసులు పెట్టారు. కాగా, కోర్టులో జరుగుతున్న కేసు విచారణకు ఇప్పటివరకు ఈ నలుగురు హాజరు కాలేదు. ఆగస్టు 1న జరిగిన విచారణకు కూడా రాకపోవటంతో కోర్టు దీనిపై సీరియస్ అయ్యింది. దాంతో దగ్గుబాటి బ్రదర్స్​ తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరవుతారని వారి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో విచారణను సెప్టెంబర్​ 10కి వాయిదా వేస్తూ ఆ రోజు ఖచ్చితంగా నలుగురు కోర్టుకు రావాల్సిందేనని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నేడు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రాణా, దగ్గుబాటి సురేశ్​, అభిరాంలు నాంపల్లి కోర్టుకు రానున్నారు. ఈసారి కూడా విచారణకు ఈ నలుగురు హాజరు కాకపోతే కోర్టు నాన్​ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసే అవకాశముందని న్యాయవాదులు అంటున్నారు.

Also Read: Bellamkonda Sai Srinivas: వారి వల్లే సినిమాకు అలా జరిగింది.. అలా అనే సరికి బాధేస్తోంది

Just In

01

NHRC Files Case: క్లినికల్ ట్రయల్స్ ముసుగులో పేదల ప్రాణాలతో చెలగాటం.. రెడ్డీస్ ల్యాబ్‌పై కేసులు!

Lavanya Tripathi: మెగా ఫ్యాన్సుకు గుడ్ న్యూస్.. వారసుడికి వెల్‌కమ్ చెప్పిన లావణ్య త్రిపాఠి

YS Jagan: అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకు.. బలవంతపు విజయోత్సవాలా.. సూపర్ సిక్స్‌పై జగన్ సెటైర్లు

New Thar Crashes: నిమ్మకాయలు తొక్కించబోయి.. రూ.15 లక్షల కొత్త కారును.. బోల్తా కొట్టించిన యువతి

Deepika Padukone: కూతురుకోసం వంట చేసిన దీపికా పదుకోణె .. ఏం చేసిందంటే?