sai-dharam-tej( image:X)
ఎంటర్‌టైన్మెంట్

Sambarla Yeti Gattu: సాయిధరమ్ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి అదిరిపోయే అప్డేట్ .. ఏం ఉంది భయ్యా..

Sambarla Yeti Gattu: మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం సంబరాల ఏటి గట్టు (SYG) తన అత్యంత కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా చిత్రం. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో ఇది అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమానుంచి అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. ఇందులో సాయిధరమ్ తేజ్ కు సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

Read also-Mirai Movie: ‘మిరాయ్’ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్.. దానిని తగ్గించడానికి ఏం చేశారంటే?

మిడ్-సెప్టెంబర్‌లో జరిగే ఈ షెడ్యూల్‌లో ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ రూపొందించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరగనుంది. ఈ దృశ్యంలో సాయి ధరమ్ తేజ్ ఒక బాలీవుడ్ సూపర్‌స్టార్‌తో శక్తిమంతమైన విలన్ పాత్రలో తలపడనున్నారు. ఈ పోస్టర్ ను చూస్తుంటే సాయిధరమ్ తేజ్ ఎప్పుడూ లేని విధంగా సిక్స్ పేక్ తో కనిపిస్తాడు. కొంత మందిని చంపిన తర్వాత వారి మధ్య నుంచి నడుచుకుంటూ వస్తుంటాడు. దీనిని బట్టి చూస్తే సినిమా మాస్ ఆడియన్స్ కు మంచి ఫల్ మీల్స్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో మళ్లీ సాయిధరమ్ తేజ్ వందకోట్ల క్లబ్ లో చేరుతాడని అభిమానులు ఆసిస్తున్నారు. ఈ చిత్రం హనుమాన్ విజయాన్ని అందించిన నిర్మాతల బృందం సమర్పణలో రూపొందుతోంది. ఇది ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచుతోంది.

Read also-Indiramma indlu: ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు పక్కా.. మంత్రి హామీ

సంబరాల ఏటి గట్టు చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ పాన్-ఇండియా చిత్రం సాయి ధరమ్ తేజ్‌ని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే సామర్థ్యం కలిగి ఉంది. చిత్రం విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం పాన్-ఇండియా సినిమాల ట్రెండ్‌లో ఈ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ పాత్ర ఒక బలమైన, ఎమోషనల్ డెప్త్ ఉన్న హీరోగా ఉంటుందని సమాచారం. రోహిత్ కేపీ దర్శకత్వంలో ఈ చిత్రం యాక్షన్‌తో పాటు భావోద్వేగ కథాంశాన్ని కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. పీటర్ హెయిన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ చిత్రం టెక్నికల్‌గా కూడా ఉన్నతంగా ఉంటుందని, విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీలో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయని అంచనా. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ గత విజయాలతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సాయి ధరమ్ తేజ్‌కి ఇది కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ఫ్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Just In

01

Indian Handicrafts: ఈ నెలలో భారతీయ చేతివృత్తుల మహోత్సవం.. ఎక్కడో తెలుసా..?

Shocking Incident: అందరూ చూస్తుండగానే.. కుప్పకూలిన స్వీడన్ ఆరోగ్య మంత్రి.. వీడియో వైరల్

Bhadra Kaali Trailer: విజయ్ ఆంటొనీ భద్రకాళి ట్రైలర్ ఇదే.. సస్పెన్స్‌తో మరోసారి మన ముందుకు

Gold Rate Today: బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Day Care Centers: క్యాన్సర్ నివారణ పై సర్కార్ ఫుల్ ఫోకస్.. అందుకు ప్రణాళికలు ఇవే..!