Star Hero ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Star Hero: 1000 కోట్ల బడ్జెట్.. ఆ స్టార్ హీరోకి ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవా?

Star Hero: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ఒక భారీ తుఫాను లాగా వీగుతోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల్లో మునిగిపోతున్నారు. మరి, సినిమా స్టార్స్ అంటే చెప్పే పనే లేదు. వారి ప్రైవేట్ లైఫ్ నుంచి సినిమా ట్రైలర్లు, పోస్టర్ల వరకు అంతా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో డైరెక్ట్ కనెక్ట్‌లో ఉంటారు.

బాలీవుడ్ హీరోలు అయితే మరి.. వారి డైలీ లైఫ్ నుంచి ప్రమోషన్ల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే నడుస్తుంది. కానీ, ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. బాలీవుడ్‌లోని టాప్ స్టార్స్‌లో ఒకరు మాత్రం సోషల్ మీడియా దూరంగా ఉంటూ, ఏ ప్లాట్‌ఫామ్‌లోనూ అకౌంట్ లేకుండా బతుకుతున్నాడు. ఏంటి మీకు షాకింగ్ లాగా ఉంది. ఇది నిజమే.. ఆ హీరో మరెవరో కాదు, రణబీర్ కపూర్.

Also Read: CM Revanth Reddy: 100రోజుల్లో మేడారం అభివృ‌ద్ధి పనులు పూర్తి చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఆ హీరోకి  సోషల్ మీడియా అకౌంట్స్ లేవా?

ఇన్‌స్టాగ్రామ్‌లో లేడు, ట్విట్టర్ (ఇప్పుడు X)లో లేడు, ఫేస్‌బుక్‌లో కూడా ట్రేస్ కూడా లేదు. ఎందుకో తెలియదు, కానీ ఆయన స్పష్టంగా ఈ డిజిటల్ వరల్డ్‌కు దూరంగా ఉంటూ, రియల్ లైఫ్‌లోనే ఫోకస్ చేస్తున్నారట. ఇక ఆయన సినిమాల అప్‌డేట్స్ అయితే? ప్రొడక్షన్ హౌస్‌లు లేదా డెడికేటెడ్ ఫ్యాన్ పేజ్‌లు షేర్ చేస్తాయి. కానీ, రణబీర్ నుంచి ఎప్పుడూ డైరెక్ట్ పోస్ట్ రాదు. ఇది నిజంగా ఒక అన్‌ఫ్రెండ్లీ మూవ్. ప్రస్తుతం, సోషల్ మీడియా సినిమా ప్రమోషన్‌లో ఒక మెయిన్ టూల్‌గా మారిపోయింది. ఫ్యాన్స్‌తో ఇంటరాక్షన్, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, వైరల్ వీడియోలు, అన్నీ బాక్సాఫీస్ సక్సెస్‌కు కీలకం.

Also Read: Karimnagar District: ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న యువతిపై లైంగిక దాడి!

అయినా, రణబీర్ ఇలా ‘ఆఫ్‌లైన్’ మోడ్‌లో ఉండమంటే.. అతని డిసిప్లిన్, ప్రైవసీ ప్రయారిటీస్‌కు గొప్ప ఉదాహరణ. ఇది చాలా మంది ఫ్యాన్స్‌కు ఆకర్షణీయంగానే ఉంది. ఎందుకంటే, అతని స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే చాలు. రణబీర్ కపూర్ ప్రస్తుతం భారతదేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. మహాభారతం లాంటి ‘రామాయణం’. దర్శకుడు నితీష్ తివారి (బాలీవుడ్‌లోని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్) ఈ ఎపిక్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Also Read: Karimnagar District: ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న యువతిపై లైంగిక దాడి!

1000 కోట్ల బడ్జెట్ లో హీరో? 

రణబీర్ రాముడిగా మెయిన్ రోల్, సాయి పల్లవి సీతగా అద్భుతంగా కనిపించనుంది. కన్నడ సూపర్‌స్టార్ యష్ రావణాసురుడిగా విలన్ రోల్ చేయబోతున్నాడు. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. రూ. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌లలో ఒకటి. 2026లో థియేటర్ల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ఎపిక్ ఎలా రిసీవ్ అవుతుందో చూడాలి. రణబీర్ ఈ మూవీతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడని ఫ్యాన్స్  కూడా  కోరుకుంటున్నారు.

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్