BRS Party (imagecredit:twittwr)
తెలంగాణ

BRS Party: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్..?

BRS Party: టిఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి(Niranjan Reddy), శ్రీనివాస్ గౌడ్(Srnivass Goud) డిమాండ్ చేశారు.

గద్వాల పట్టణంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గద్వాల పర్యటనపై నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు(Basu Hanumanthu Naidu) ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే విజయుడు, మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతక ముందు, కేటీఆర్ పాల్గొననున్న సభ స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) ఈనెల 13 వ తేదీన గద్వాల నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని, కేటీఆర్ రోడ్ షో, భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, మాజీ జడ్పీటీసీ లు, మాజీ కౌన్సిలర్, లతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతారని తెలిపారు. ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలయ్యాక హామీలను తుంగలో తొక్కి రైతులను, కార్మికులను, ఉద్యోగులు అన్నీ వర్గాల ప్రజలను మోసం చేసారని విమర్శించారు.

Also Read: GHMC sanitation: గణేశ్ నిమజ్జనాల సందర్భంగా, హైదరాబాద్‌లో ఎంత చెత్త సేకరించారంటే?

యూరియా సమస్య రానీయకుండా

పదేళ్ళ కాలంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్(KCR) రైతులకు కన్నీళ్లు రాకుండా కాపాడుకున్నారని, అన్నీ వర్గాల ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేసి కష్టాలను రూపుమాపారని గుర్తు చేశారు. పదేళ్ళ కాలంలో ఎన్నడూ యూరియా సమస్య రానీయకుండా పాలన చేస్తే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం రైతులను రోడ్డుమీదకు తీసుకువచ్చి యూరియా(Urea) కోసం గంటల తరబడి లైన్లో వేచి ఉండేలా చేశారని, బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) కు చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే వారు ఏ ఒక్క రోజు రైతుల కష్టాలు, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేంద్రం చేసే పనులకు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ధ్వజమెత్తారు.

AlsoRead: CM Revanth Reddy: హాట్ టాఫిక్ గా మారిన ఎమ్మెల్యేల భేటీ.. సీఎం హామీ..?

Just In

01

Hydra: గ‌చ్చిబౌలిలో 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Akshay Kumar: అక్షయ్ కుమార్ ఎమోషనల్ పోస్ట్ .. ఎందుకంటే?

Kavitha: సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయం.. కవిత కీలక వ్యాఖ్యలు

Jabardasth Show Controversy: జబర్దస్త్‌లో కుల వివక్షపై నటుడు షాకింగ్ కామెంట్స్.. బయటికి రావడానికి కారణం అదే!

KTR: ఫార్ములా-ఈ కారు కేసు ఒక లొట్టపీసు కేసు.. కేటీఆర్ సంచలన కామెంట్స్!