Nursing Schools Scam (imagecredit:twitter)
తెలంగాణ

Nursing Schools Scam: రాష్ట్రంలో నర్సింగ్ స్కూల్స్ దందాలు.. పట్టించుకోని అధికారులు

Nursing Schools Scam: ఎడ్యుకేషన్ అనేది అంగడి సరుకుగా మారిపోయింది. అందిన కాడికి దోచుకోవాలనే పద్దతిని ప్రయివేట్ విద్య సంస్థల యాజమాన్యం భావిస్తున్నాయి. మొన్న ప్రయివేట్ ఇంటర్ కాలేజీలు, నిన్న ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ఇంజనీరింగ్, పీజీ కాలేజిల యాజమాన్యం బాగోతం అంత ఇంత కాదనే ప్రచారం కూడా ఉంది. ఈ ఘటనలు మరువక ముందే నర్సింగ్ స్కూల్స్(Nursing Schools) బాగోతం బయటపడుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి మెడికల్ ఏడ్యుకేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నర్సింగ్ స్కూల్స్ పరిశీలించకుండానే అనుమతులు ఇస్తారు. ఆ స్కూల్స్ ఎక్కడ నడుస్తున్నాయో కూడా అవగాహన లేని అధికారులు ఉన్నారని తెలుస్తుంది. జిల్లాలో నిర్వహించే స్కూల్స్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలోకి తెచ్చి ఇస్టానుసారంగ నడిపిస్తున్నారు.

కొన్ని ఉదాహరణలు

-మొయినాబాద్ మండల పరిధిలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 15 నర్సింగ్ స్కూల్స్ ఒకే భవనంలో కొనసాగించడం ఆశ్చర్యనికి గురి చేస్తున్నాయి.

-వనస్థలిపురం శారదనగర్ కాలనీలో నర్సింగ్ స్కూల్ నడుస్తుంది. ఈ ఒక్క భవనంలో 8స్కూల్స్ నడవడం గమనార్హం. అంతేకాకుండా ఈ స్కూల్ నల్లగొండ జిల్లాకు చెందినదిగా గుర్తింపు.

-రంగారెడ్డి జిల్లా తుర్కయాంంజల్లో ఓకే భవనంలో రెండు నర్సింగ్ స్కూల్స్ నడుస్తున్నాయి.

-నల్లగొండ జిల్లాలోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ దగ్గర ఒకే భవనంలో నాలుగు నర్సింగ్ స్కూల్స్ కొనసాగిస్తున్నారు.

ఇష్టానుసారంగా నిర్వహణ

నర్సింగ్ స్కూల్స్ నిబంధనలు ఉల్లంఘించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(Director of Medical Education), నర్సింగ్ కౌన్సిల్ నుండి గుర్తింపు తీసుకున్న అడ్రస్లో కాకుండా పూర్తిగా ఇతర ప్రాంతాల్లో నడిపించడం విడ్డురంగా ఉంది. ఈ వ్యవహారం ఇటీవల కాలంలో నడుస్తున్న దందా కాదు. గత ఏడు యేండ్లుగా సాగుతున్న తతంగం. 2025లో 35 నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్కు అనుమతులు ఇచ్చారు. అవి ఏ అడ్రస్ లో ఉన్నాయో, వాటి యొక్క భవనాలు ఎక్కడ ఉన్నాయో అధికారులకే తెలియదు. నర్సింగ్ స్కూల్ నడిపించాలంటే ఈ నిబంధనలు ఉండాల్సిందే.

Also Read; CM Revanth Reddy: హాట్ టాఫిక్ గా మారిన ఎమ్మెల్యేల భేటీ.. సీఎం హామీ..?

60 మంది విద్యార్థులకు ప్రిన్సిపల్

60 మంది విద్యార్థులు ఉన్నచోట 20వేల చదరపు అడుగులు టీచింగ్ బ్లాక్, 17,500 చదరపు అడుగులు హాస్టల్ బ్లాక్.. ఇలా మొత్తం కలిపి మొత్తం కలిపి 37,500 చదరపు అడుగుల స్థలము ఉండాలి. అదే మూడు సంవత్సరాల కోర్సు 180 మంది విద్యార్థులకు ఒక ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టూటర్స్ కలిపి 18 మంది ఫ్యాకల్టీ ఉండాలి. కొత్తగా ఏర్పడినటువంటి నర్సింగ్ స్కూల్ అయితే 60 మంది విద్యార్థులకు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ తోపాటు ఆరుగురు టూటర్స్ ఉండాలి. కానీ ఇవేవి నిబంధనలు పాటించకుండా తరగతులు, ప్రాక్టికల్స్ లేకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఉపాధి కోసమే అత్యధిక పేద విద్యార్థులు నర్సింగ్ కోర్సుల్లో చేరుతారు. ఇలాంటి విద్యార్థులతో స్కూల్ యాజమాన్యం ఆటలాడుతుంది. కేవలం రూ. కోట్ల రీయంబర్స్మెంట్ కోసమే నర్సింగ్ స్కూల్స్ నడిపిస్తున్నారు.

ఆ అధికారితోనే ఆగమైతుందా…?

రాష్ట్రంలో 200లకు పైగా నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోనే 68 స్కూల్స్ ఉండటం గమనర్హం. వీటికి అనుమతిని ఇచ్చేది డైరెక్టర్ అఫ్ మెడికల్ ఏడ్యుకేషన్ తెలంగాణ స్టేట్.. ఈ స్కూల్స్ నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే విషయాలను పరిశీలించాల్సింది నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్. అయితే ఈ రిజిస్ట్రార్ ఓకే చోట 8యేండ్లుగా పనిచేయడంతో నర్సింగ్ స్కూల్స్ యాజమాన్యంతో మంచి సంబంధలున్నాయని ప్రచారం సాగుతుంది. అంతే కాకుండా ప్రభుత్వాలు మారిన ఆ అధికారి అదే చెర్లో యేండ్లుగా కొనసాగడం వారి ప్రత్యేకత. ప్రతి ప్రవైట్ నర్సింగ్ స్కూల్స్ నుంచి ఏడాదికి రూ.2లక్షల నుంచి రూ.4లక్షలు కప్పం కట్టాలని ఆ అధికారి ఆదేశమనే చర్చ కూడా సాగుతుంది. దీంతో ఆ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంగించిన చర్యలు ఉండవ్ అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ అఫ్ మెడికల్ ఏడ్యుకేషన్ అధికారికి క్రైస్తవ జన సమితి నేత ఆధారాలతో పిర్యాదు చేశారు.

విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వంలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు 23 నర్సింగ్ స్కూల్స్ పైఆధారాలతో పిర్యాదు చేశాను. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి నర్సింగ్ స్కూల్లో చదివిన విద్యార్థులను ఏ ఆస్పత్రులలోను రిక్రూట్ కాకుండా చూడాలని కోరుతున్నాను. దీంతో రోగులకు సేవలు అందించడంలో విఫలం అయ్యే ప్రమాదం ఉంది. ఆ స్కూల్ యాజమాన్యం కేవలం ప్రభుత్వ సొమ్మును దోచుకెందుకే నడిపిస్తున్నారు.

Also Read: Jangaon district: గ్రామాల్లో వెలుగ‌ని వీధిలైట్లు.. అప్పులో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు!

Just In

01

Jabardasth Show Controversy: జబర్దస్త్‌లో కుల వివక్షపై నటుడు షాకింగ్ కామెంట్స్.. బయటికి రావడానికి కారణం అదే!

KTR: ఫార్ములా-ఈ కారు కేసు ఒక లొట్టపీసు కేసు.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

CP Radhakrishnan: భారత 14వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. తెలుగు అభ్యర్థిపై గెలుపు

Digital Crop Survey: పంటల నమోదుకు సాంకేతికత.. పకడ్బందీగా డిజిటల్ క్రాప్ సర్వే!

Formula E Case: ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కీలక స్టెప్.. ఏం జరగబోతోంది?