Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఏది పట్టినా బంగారం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. రాజకీయాల్లో వరుసగా హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య (Balayya), సినిమాల పరంగానూ తిరుగులేని సక్సెస్‌తో దూసుకుపోతున్నారు. ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర విజయ ఢంకా మోగిస్తున్నాయి. రాబోయే సినిమా కూడా షూర్ షాట్ హిట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు కూడా. ఎందుకంటే, ఆ సినిమాకున్న పవర్ అలాంటిది. మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam) చిత్రంలో బాలయ్య మరోసారి విశ్వరూపం చూపించబోతున్నారనేది, ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చెప్పకనే చెప్పేసింది. ఇక అవార్డుల పరంగానూ బాలయ్య ఓ రేంజ్‌లో దూసుకెళుతున్నారు.
Also Read- Trisha: విజయ్ పొలిటికల్ పార్టీపై త్రిష ఆసక్తికర కామెంట్స్.. ఏదో తేడాగా ఉందేంటి?
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)లో బెల్ మోగించిన బాలయ్య
కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ (Padma Bhushan) పురస్కారాన్ని అందుకున్న బాలయ్య, సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన గ్రాండ్ ఈవెంట్ రీసెంట్‌గానే జరిగింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లోనూ బాలయ్య తన సత్తా చాటారు. ఇలా ఎక్కడ చూసినా బాలయ్య పేరే వినిపిస్తుంది. ఇప్పుడు మరో హిస్టరీని క్రియేట్ చేశారీ నందమూరి నటసింహం. అదేంటంటే.. దేశంలోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)లో బెల్ మోగించిన తొలి దక్షిణ భారత నటుడిగా నందమూరి బాలకృష్ణ గౌరవం దక్కించుకున్నారు. ఇంతకు ముందు దక్షిణాదికి చెందిన ఏ నటుడు ఈ గౌరవాన్ని పొందలేదు. ఫస్ట్ టైమ్ బాలయ్యకే ఆ అవకాశం లభించింది. నార్త్ నుంచి మాత్రం అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, శిల్పా శెట్టి వంటి వారు ఇందుకు ముందు ఈ గౌరవాన్ని పొందారు.
Also Read- Bandla Ganesh: దున్నేయ్.. ఇక టాలీవుడ్ నీదే.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి బండ్ల బూస్ట్!
ఆ జాబితాలో బాలయ్యకు చోటు
ఈ చారిత్రాత్మక ఘట్టం బాలకృష్ణ ఎన్‌ఎస్‌ఈ (National Stock Exchange) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. తన తల్లి స్మారకార్థంగా స్థాపించబడిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు బాలయ్య ఎన్నో సంవత్సరాలుగా అండగా నిలుస్తూ, దేశవ్యాప్తంగా వేలాది మంది.. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యం అందేలా కృషి చేస్తున్నారు. ఎన్ఎస్ఈలో బెల్ మోగించే గౌరవం పారిశ్రామిక దిగ్గజాలు, సంస్కరణకారులు, జాతీయ ప్రాధాన్యత కలిగిన వ్యక్తులకే లభిస్తుందనే విషయం తెలియంది కాదు. ఆ జాబితాలో ఇప్పుడు బాలకృష్ణ చేరడం ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదు సామాజిక సేవ, వైద్యరంగంపై చూపుతున్న ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు