Kavithakka Update (imagecredit:twitter)
Politics

Kavithakka Update: కవితక్క అప్ డేట్ పేరుతో ఎక్స్లో కథనాలు.. టార్గెట్ గులాబీ నేతలు?

Kavithakka Update: గులాబీ నేతల టార్గెట్ గా విమర్శనాస్త్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత(kavitha) మీడియా వేదికగా చేసిన ఆరోపణల తర్వాత ‘కవితక్క అప్ డేట్’ పేరుతో వరుస కథనాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నేతల పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నారు. నేతలు చేసిన తప్పిదాలను, పార్టీకి, కేసీఆర్(KCR) కు నష్టం కలిగించేలా చేసిన అంశాలను వివరిస్తున్నారు. ఈ కథకాలను ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రోజూకో పోస్టు పెడుతూ నేతల తీరును ఎండగడుతున్నారు. ఆదివారం కోరుట్ల కుతంత్రపు “విద్యా” అనే పేరుతో కథనాన్ని పోస్టు చేసింది. 2008లో కేసీఆర్‌ను ఓడించాలని 6 కోట్లు తీసుకొని క్రాస్ ఓటింగ్ చేసిన కోరుట్ల నేత అని పేర్కొన్నారు. దీంతో కేసీఆర్ చేతిలో 6 నెలల సస్పెన్షన్ ఆలీడర్ గురయ్యారని పోస్టులో పేర్కొన్నారు.

కరుడు కట్టిన కార్యకర్త

కన్నకొడుకుకే ఎమ్మెల్యే టికెట్ రాకుండా కేడర్‌తో వ్యతిరేక నినాదాలు చేయించి, తనకే టికెట్ దక్కేలా విశ్వ ప్రయత్నాలు చేసిన మహా కుట్రదారి.. ఈరోజు అదే వ్యక్తి కేసీఆర్ కనబిడ్డ మీద నోరు పారేసుకోవడం ఒక విడ్డూరం కాదా? అని ప్రశ్నించారు. ఖాదీ బోర్డును బ్రష్టు పట్టించేందుకు ఖాదీ యాజమాన్య బోర్డును మార్చి తన మనుషులను కూర్చోబెట్టి, బీఆర్ఎస్(BRS) పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన కరుడు కట్టిన కార్యకర్త అని మండిపడ్డారు. ప్రైవేట్ క్లబ్‌లో మెంబర్‌గా చేరి, క్లబ్ ఆస్తుల మీద కన్నేసి, 8 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని 4 కోట్లకే ఒక మర్వాడికి అప్పజెప్పిన మహా వ్యాపారవేత్త అని దుయ్యబట్టారు. ఇంటి పేరు తప్ప కేసీఆ(KCR)ర్‌తో అసలు వేరే ఏ బంధం లేనివాడు అని పేర్కొన్నారు. కొడుకు ద్వారా కేసీఆర్‌కు దెగ్గరై అదే కొడుకుకే ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడానికి పన్నాగాలు పన్నిన కన్న తండ్రి అని తీవ్ర విమర్శలు చేశారు. అతడి ఆవేశమంతా తన రాజకీయ భవిష్యత్తు కోసమే.. కేసీఆర్ కోసం కాదు, కేటీఆర్ కోసం కాదు. బీఆర్ఎస్ కోసం కాదు. తెలంగాణ కోసం అసలు కాదు.. అని పోస్టు చేశారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఇప్పటికే రెండు కథనాలు

బీఆర్ఎస్ నేతలపై ఇప్పటికే రెండు కథనాలు వెలువడ్డాయి. ట్రాక్టర్లతో 120కోట్ల హ్యాపీ రావు ప్రగతి, హంపీలో కమలాన్ని మొలకెత్తించాలనుకున్న కారు ఓనర్లు అంటూ కథనాలను పోస్టు చేశారు. అయితే ఈ పోస్టులోని సారాంశాలు పార్టీలో కీలక నేతలపైనే చేసినట్లు స్పష్టమవుతుంది. ‘కేసీఆర్ కి వెన్నుపోటు పొడవాలి అని, కార్ ఓనర్‌ను బలిచ్చిన మచ్చ…రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో, నల్గొండకు చెందిన ఒక ముఖ్య కారు నాయకుడి పార్టీ అని చెప్పి, కొంతమంది గులాబీ నాయకులు హంపీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన సందర్భం వేరే అయినా, కేసీఆర్ తరువాత కేటీఆర్‌ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోము, పార్టీకి ఓనర్లమేము. కేటీఆర్ కొడుకు కాబట్టి అతడిని సీఎం చేయాలా? అని కొంతమంది రసవత్తరంగా చెప్పారు. పార్టీకి, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పాటలు కూడా పాడారు. అగ్గిపెట్ట మచ్చ, పార్టీ ఓనర్ మరియు ఇతర నాయకులు కలిసి కొత్త పార్టీ పెట్టాలి అని మొదట అనుకున్నా, అది సాధ్యమవుతుందో లేదో అనుమానంతో కమలం పార్టీలోకి వెళ్లాలని ఆ నాయకులు భావించారు.

Also Read: VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

ఎంతవరకు ఉంచాలో, అక్కడ వరకే

అయితే ఒక సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటి కుట్రలు తెలియవు అనుకోవడంవారి తెలివితక్కువతనం.ఈ విషయాలు అన్నీ పూసగుచ్చినట్లు కేసీఆర్ కి తెలిసినవి . అప్పుడు మెల్లగా మన మచ్చ, కేటీఆర్ దగ్గరకు వచ్చి ‘నేను మా వెంటనే ఉంటా, ఎక్కడికీ వెళ్లను. నువ్వే ఏదైనా చేసి ఒప్పించాలి. నేను ఏం చేయలేదు, మొత్తం పార్టీ ఓనర్ చేశాడు’ అని చెప్పి, పాపం పార్టీ ఓనర్‌ను తన స్వార్థం కోసం బలిచేశాడు. ఇలాగే చెప్పితే నమ్ముతారో లేదో అని, తన వద్దకు వచ్చిన ఒక సింగర్ నాయకుడి రికార్డింగ్ కూడా ఇచ్చాడు.తనకు మంత్రి పదవి ఇచ్చినా, కేవలం అమలు చేయడం వరకే పరిమితం చేశారు. ఎక్కడ ఎంతవరకు ఉంచాలో, అక్కడ వరకే ఉంచారు కేసీఆర్. ఇప్పుడు మళ్లీ బీజేపీకి వెళ్తున్నాడని వార్తలు రప్పించుకొని, బ్లాక్‌మెయిల్ చేసి పార్టీ లో నంబర్ 3 స్థానం దక్కించుకున్నాడు. కానీ అతని దాహం అక్కడితో ఆగలేదు. కేసీఆర్ గారికంటే తానే గొప్ప అని, ఒక మేధావి కొంతమంది కూలీలతోచెప్పించుకుంటున్నాడు. ఈ సమావేశంలో నల్గొండకు చెందిన అప్పటి కొంతమంది ఎమ్మెల్యేలు, చంటి, రసమలై, పార్టీ ఓనర్… తదితరులు ఉన్నారు. వాళ్ల పేర్లు సందర్భం వచ్చినప్పుడు బయట పెడతాం.’ అనే కథనాన్ని పోస్టు చేశారు.

మరోపోస్టులో..

‘కేసీఆర్ మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభించారు.సంతోషంగా హ్యాపీ రావు గ్రీన్ ఇండియా అనే కొత్త డ్రామా మొదలు పెట్టాడు. అతని కన్ను ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చే ట్రాక్టర్ల మీద పడింది. తన బినామీ అయిన వరికోలు వాసి, కోడిపందాలు చేసే హ్యాపీ రావు క్లాస్ దోస్తుతో 120+ కోట్ల కమిషన్ కోసం స్కెచ్ వేసాడు.అప్పటికే ఆ పిస్సార్ ట్రాక్టర్‌కి సంబంధించిన బిజినెస్ చేసి ఉండటం వల్ల బెంగళూరులో ట్రాక్టర్ కంపెనీలను పిలిపించుకుని, ఒక్కో ట్రాక్టర్‌కు లక్ష రూపాయిలు ఇవ్వాలనే ఒప్పందం కుదిరించుకున్నారు.ఈ ఒప్పందంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రిని దయ లేకుండా పక్కన పెట్టి, అతనికి వాటా ఇవ్వలేదు. ఆ మంత్రి కావాలని గట్టిగా అడగగా, అతనికి ఒక ఖరీదైన కారు ఇంటికి పంపించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ కారుకి ఈఎంఐ కూడా కట్టలేదు. హ్యాపీ రావు వల్ల ఇప్పటికీ ఆ సదరు మాజీ మంత్రి ఆ అవసరం లేని కారుకు తన సొంత పైసలతో ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు.ఆ 120+ కోట్లు ఇద్దరూ పంచుకుని, ఆ మంత్రికి మొండి చేయి చూపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఇద్దరు నాయకులకు కొన్ని రోజులు మాటలు లేకపోయాయి. ఈ మధ్యనే కుట్టుమిషన్లు పంచుత

ఈ పోస్టు వెనుక ఎవరు?

వరుస కథనాలు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే ప్రచారం ఊపందుకుంది. కవితక్క అప్ డేట్ ను ఎవరు క్రియేట్ చేశారు.. దాని వెనుక ఉన్నది ఎవరు.. ఎవరు ఈ ‘ఎక్స్’ హ్యాండిల్ ను నడుపుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గులాబీ నేతలను టార్గెట్ గా చేసుకొని ఒక్కొక్క నేత చేసిన తప్పిదాలను బయటపెడుతుండటం రాజకీయ నేతలు సైతం చర్చించుకుంటున్నారు. ఎవరు నేతల సమాచారం ఇస్తున్నారు.. ఇవ్వాల్సిన పనేముంది.. అనేది విస్తృతం చర్చజరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై, ఏ నేతపై ఏ కథనం వస్తుందోనని నేతల్లో టెన్షన్ నెలకొనగా, రాజకీయ వర్గాలు మాత్రం కథనాలకోసం ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇంకా ఎంతమంది నేతలపై వరుసకథనాలు వస్తాయో చూడాలి.

Also Read: Bigg Boss 9 Telugu: ఇద్దరు సెలబ్రిటీల అనంతరం.. మూడో హౌస్‌మేట్‌గా కామనర్.. ఎవరంటే?

Just In

01

Group 1 Exams: హైకోర్టు సంచలన తీర్పు.. గ్రూప్-1 ఫలితాలు రద్దు.. మళ్లీ మెుదటి నుంచి!

Gold Rate Today: వామ్మో.. నేడు అతి భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన గోల్డ్!

Mahabubabad District: యూరియా కోసం పొద్దున్నే క్యూ కట్టిన రైతులు.. ఎక్కడంటే..?

Allu Arjun: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కు జీహెచ్‌ఎంసీ నుంచి షాకింగ్ నోటీసు!

Hero Dog: ఓరి దేవుడా.. ఈ శునకం మాముల్ది కాదు భయ్యో.. బాంబ్ బ్లాస్ట్‌నే అడ్డుకుంది!