Sujeeth Next movie: సుజిత్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితోనో తెలిస్తే షాక్..
sujeeth( Image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Sujeeth Next movie: ‘ఓజీ’ తర్వాత సుజిత్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితోనో తెలిస్తే షాకే.. అయితే ఫ్యాన్స్‌కు పండగే..

Sujeeth Next movie: ఓజీ తర్వాత సుజిత్ ఏం చేయబోతున్నారు. ఎంవరితో తీయబోతున్నారు. హీరో ఎవరు. అనే దానిపై ఇప్పటికీ చాలా మందిలో సందేహం ఉంది. అయితే తాజాగా దీనికి సంబంధించి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సారి ఈ క్రేజీ దర్శకుడు ఇప్పటికే మంచి హిట్లతో దూసుకుపోతున్న హీరోతో సినిమా తీయబోతున్నారు అని తెలుస్తోంది. సుజిత్ (Sujeeth Next movie) తీసినవి కొన్ని సినిమాలే అయితే ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి తీస్తుంటారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ తో తీసిన సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ ‘ఓజీ ’ తర్వాత నేచురల్ స్టార్ నానీతో సినిమా తీయబోతున్నారు అని తెలుస్తోంది. దీనికి సంబంధించి సుజిత్ ఇన్ట్సాగ్రమ్ బయోలో రచయిత దర్శకుడు అని.. రన్ రాజ రన్, సాహో, దే కాల్ హిమ్ ఓజీ, తర్వాత నాని సుజిత్ అని ఉంది. అంటే ఓజీ తర్వాత మూవీ నానీతో ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకత్వంతో తనకంటూ ఓ మర్క్ సాధించుకున్న సుజిత్ నానీతో కలుస్తున్నాడంటే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫాన్స్. అయితే ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం

Read also-Actress Navya Nair: నటికి బిగ్ షాక్.. మల్లెపూలు పెట్టుకుందని.. ఏకంగా రూ.1.14 లక్షల ఫైన్

దర్శకుడు సుజీత్ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన యువ దర్శకుడు. అతను 1990 అక్టోబర్ 25న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఆర్థిక శాస్త్రం విషయంలో డిగ్రీ పూర్తి చేసిన సుజీత్, 17 ఏళ్ల వయస్సులో షార్ట్ ఫిల్మ్‌లు తయారు చేయడం మొదలుపెట్టాడు. అతను L.V. ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలో ఫిల్మ్ కోర్సు చేసి, 30కి పైగా షార్ట్ ఫిల్మ్‌లు తీశాడు. సినిమా పరిశ్రమలో పూరీ జగన్నాథ్‌తో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయాలని అనుకున్నప్పటికీ, పూరీ సూచనల మేరకు స్వతంత్రంగా డైరెక్టర్‌గా అడుగుపెట్టాడు. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజీ’ అనేది భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ‘ఓజాస్ గంభీర’, ఇది ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే అర్థం కలిగి ఉంది. సుజీత్ మొదట ఈ కథను ప్రభాస్‌కు వివరించాడు, కానీ ప్రభాస్ ఇతర ప్రాజెక్టుల కారణంగా ఒప్పుకోలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ కు చెప్పగా ఓకే చెప్పి పట్టాలెక్కించారు.

Read also-Vikram Bhatt: కన్నీళ్లు పెట్టిస్తున్న దర్శకుడి ఎమోషనల్ పోస్ట్.. తల్లి కోసం ఏం చేశాడంటే..

‘దసరా’ విజయం తర్వాత నాని, ఓదెల రెండోసారి కలిసి చేస్తున్నారు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేసిన యాక్షన్-డ్రామా. పోస్టర్‌లో చార్మినార్, తుపాకీలు, రక్తపు దృశ్యాలు కనిపించాయి. నాని పాత్ర ‘ఇంటెన్స్’ ‘లార్జర్-దాన్-లైఫ్’గా ఉంటుంది. హింస, అధికార పోరాటాలు కీలకం. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. నానీకి ఈ సినిమా అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. ఈ సినిమా కూడా పాన్-ఇండియా రేంజ్‌లో ఉంటుంది. అయితే ఈ సినిమా తర్వాత సుజిత్ ప్రాజెక్ట్ ఉండబోతుందిని తెలుస్తోంది. ఏది ఏమైనా వీరిద్దరి కాంబోలు సినిమా రాబోతుందంటే నాని, సుజిత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Missterious: సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న “మిస్టీరియస్”

MGNREGS: సంచలనం.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేయబోతున్న కేంద్రం?

Balkapur Nala: క‌నుమ‌రుగ‌య్యే ప్రమాదంలో వాగు.. అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు

Bharani Emotional: బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత భరణి ఎమోషనల్.. ఏం చెప్పారు అంటే?

India Russia Trade: భారత్–రష్యా వాణిజ్యంలో కొత్త మలుపు.. 300 ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు