Srishti Varma, Mask Man Harish, Bharani
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి 5, 6, 7వ హౌస్‌మేట్స్‌గా అడుగు పెట్టింది ఎవరంటే.. ట్విస్ట్ ఏంటంటే?

Bigg Boss9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) మొదలైంది. సెప్టెంబర్ 7, ఆదివారం ఈ షో‌ని గ్రాండ్‌గా ప్రారంభించారు. మొదటి హౌస్‌మేట్‌గా తనూజ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, రెండో హౌస్‌మేట్‌గా హీరోయిన్ ఫ్లోరా షైనీ ఎంట్రీ ఇచ్చారు. మూడో హౌస్‌మేట్‌గా కామనర్ కళ్యాణ్ పడాల అడుగు పెట్టారు. నాలుగో హౌస్‌మేట్‌‌గా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు 5వ హౌస్‌మేట్‌ ఎవరు వెళుతున్నారంటే..

ఐదో హౌస్‌మేట్‌: కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ

ఇటీవల కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో బాగా వైరల్ అయిన అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి 5వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఆమె అద్భుతమైన సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. అనంతరం నాగార్జున ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఇప్పటి వరకు ఎవరెవరికి కొరియోగ్రఫీ చేశావని అడగగా, శర్వానంద్, అల్లు అర్జున్‌లకు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. వెంటనే నా పాటకు డ్యాన్స్ చేస్తే.. హౌస్‌లోకి పంపిస్తానని నాగ్ అన్నారు. వెంటనే ఆమె ‘కన్నెపెట్టరో..’ అనే పాటకు డ్యాన్స్ చేశారు. వెంటనే నువ్వు త్వరగా వచ్చేస్తే.. నాకు కూడా కొరియోగ్రఫీ చేద్దువు గానీ అని చెప్పి.. ఆమెను హౌస్‌లోకి పంపించారు. హౌస్‌లోని వాళ్లంగా ఆమెకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చేశారు.

Also Read- Bigg Boss 9 Telugu: ఇద్దరు సెలబ్రిటీల అనంతరం.. మూడో హౌస్‌మేట్‌గా కామనర్.. ఎవరంటే?

ఆరో హౌస్‌మేట్‌‌గా కామనర్: మాస్క్ మ్యాన్ హరీష్

బిగ్ బాస్ హౌస్‌లోకి 6వ హౌస్‌మేట్‌గా మాస్క్ మ్యాన్ హరీష్ ఎంట్రీ ఇచ్చారు. హరీష్‌ను అగ్ని పరీక్ష జ్యూరీ మెంబర్ బిందు మాధవి కార్డుతో ఎంపిక చేశారు. తర్వాత హరీష్ గురించి బిందు మాధవి చాలా గొప్పగా చెప్పారు. ఉన్న వారిలో హరీష్ బెస్ట్ కామనర్ అని ఆమె చెప్పారు. హరీష్ మాట్లాడుతూ.. తన డ్రీమ్ నిజం అయ్యిందని, బిగ్ బాస్‌ నాకు చాలా ఇష్టం అని అన్నారు. ఈ సీజన్‌లో ఎన్ని రోజులు హౌస్‌లో ఉంటే అన్ని రోజులు గుండుతోనే ఉండాలంటూ నాగార్జున చెప్పిన మాటకు ఆయన ఓకే చెప్పారు. హరీష్‌ హౌస్‌లోకి అడుగు పెట్టిన తర్వాత నాగార్జున్ ఓ టాస్క్ ఇచ్చారు. హౌస్‌ని క్లీన్ చేసే బాధ్యత ఇమ్మానుయెల్‌ తీసుకున్నారు.

Also Read- Bigg Boss9 Telugu: డబుల్ హౌస్, డబుల్ జోష్.. స్టార్టింగే కింగ్ నాగ్‌కు పరీక్షలు

ఏడవ హౌస్‌మేట్‌‌: నటుడు భరణి (ట్విస్ట్)

ఏడవ హౌస్‌మేట్‌‌‌గా నటుడు భరణి వెళ్లాల్సి ఉంది కానీ, అతను ఓ బాక్స్‌ని హౌస్‌లోకి తీసుకు వెళ్లడానికి అనుమతి అడిగారు. కానీ అందుకు బిగ్ బాస్ అంగీకరించలేదు. ఆ బాక్స్‌లో ఏముందో చెబితే పంపిస్తానని చెప్పినా, అందుకు భరణి ఒప్పుకోలేదు. దీంతో బిగ్ బాస్ అతనని ఇంటికి పంపించేశారు. ఈ ట్విస్ట్ ఎవరికీ అర్థం కాలేదు. భరణి వెనక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కాసేపటికే బిగ్ బాస్ తన మనసు మార్చుకుని భరణిని హౌస్‌లోకి వెళ్లడానికి ఓకే చెప్పారు. ఆ బాక్స్‌లో ఓ లాకెట్ ఉందని, అది అతని సెంటిమెంట్ అని చెప్పారు. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత దాని గురించి చెబుతాడని నాగ్ చెప్పారు. తర్వాత భరణి లైఫ్‌లో జరిగిన ఓ విషయాన్ని నాగ్ డిస్కస్ చేసి, చిన్న టెస్ట్ పెట్టి హౌస్‌లోకి పంపించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?