Manoj Manchu: నో డూప్స్, మంచు మనోజ్‌ స్టంట్స్ పై ఫైట్ మాస్టర్!
Manoj and Badri
ఎంటర్‌టైన్‌మెంట్

Manoj Manchu: డూప్స్ లేకుండా రియల్ స్టంట్స్.. మంచు మనోజ్‌పై ఫైట్ మాస్టర్ కామెంట్స్

Manoj Manchu: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) ఈ మధ్య వార్తల్లో ఎలా నిలిచాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రి మోహన్ బాబు (Mohan Babu), అన్న మంచు విష్ణు (Vishnu Manchu)లపై ఆయన చిన్నపాటి యుద్ధమే చేశారు. ఇంకా చెప్పాలంటే మంచు మనోజ్ లైఫ్‌లో గత కొంత కాలంగా బ్యాడ్ ఫేజ్ నడుస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొదటి భార్యకు విడాకులు, ఒక బిడ్డ ఉన్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడం, అన్న విష్ణుతో గొడవలు, మోహన్ బాబుతో ఆస్తి తగాదాలు, పోలీస్ కేసులు.. ఇలా వరుస సంఘటనలతో ఆయన లైఫ్ చిందరవందరగా మారిపోయింది. మళ్లీ దానిని లైన్‌లో పెట్టేందుకు ఇప్పుడిప్పుడే మంచు మనోజ్ ప్రయత్నిస్తున్నారు. ఈ ఇష్యూస్‌లో పడి నటనకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఈ మధ్యే మళ్లీ ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన ‘భైరవం’ సినిమా విడుదల కాగా, ఇప్పటి వరకు చేయని పాత్రలో నటించిన ‘మిరాయ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ రియల్ స్టంట్స్ గురించి ఫైట్ మాస్టర్ బద్రి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

Also Read- Bandla Ganesh: దున్నేయ్.. ఇక టాలీవుడ్ నీదే.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి బండ్ల బూస్ట్!

డూప్స్ లేకుండా రియల్ స్టంట్స్

వాస్తవానికి మంచు మనోజ్‌కు రాకింగ్ స్టార్ ఇమేజ్ వచ్చిందే ఆయన స్టంట్స్ ద్వారా. సినిమా ఎలా ఉన్నా.. మంచు మనోజ్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఆయన సినిమాల్లో స్టంట్స్ ఎందుకు బాగుంటాయో తాజాగా స్టంట్ మాస్టర్ బద్రి (Fight Master Badri) చెబుతున్న యూట్యూబ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో స్టంట్ మాస్టర్ బద్రి మాట్లాడుతూ మనోజ్ రియల్‌గా చేసే స్టంట్స్ గురించి వివరించారు. డూప్స్ పెట్టుకునేందుకు మనోజ్ అస్సలు ఇష్టపడడని, తనే ఒరిజినల్‌గా ఫైట్స్ చేస్తాడని బద్రి చెప్పుకొచ్చారు. మనోజ్ మొండిగా స్టంట్స్ చేస్తాడు, రెండు ఫ్లోర్స్ బిల్డింగ్ నుంచి గ్లాస్ బ్రేక్ చేసి దూకే యాక్షన్ సీన్‌ను ఈ మధ్యే చేశాం. ఇప్పుడు యాక్షన్ సీన్స్ చేసే సమయంలో హీరోల సేఫ్టీకి కొత్త కొత్త పద్దతులు వచ్చాయి, గతంలో కింద బెడ్స్ కూడా ఉండేవి కావు. రోప్స్ కూడా కట్టుకోకుండా మనోజ్ దూకేసేవాడని స్టంట్ మాస్టర్ బద్రి తెలిపారు. మనోజ్ గురించి బద్రి చెబుతున్న మాటలు నెటిజన్లని బాగా ఆకర్షిస్తున్నాయి.

Also Read- Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

హీరోలందరి అభిమానులకు ఇష్టం

మంచు మనోజ్ అంటే ఇండస్ట్రీలోని అందరు హీరోల ఫ్యాన్స్ ఇష్టపడతారు. మంచు ఫ్యామిలీలో అందరూ లైక్ చేసే హీరో ఎవరంటే మాత్రం వెంటనే అతని పేరే చెబుతారు. అటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా మనోజ్‌పై ఎప్పుడూ నెగిటివ్‌గా కామెంట్స్ చేయలేదు. మనోజ్ కూడా ఈ హీరోలందరికీ మంచి స్నేహితుడు. సమయం వచ్చిన ప్రతిసారి ఈ హీరోల గురించి మనోజ్ ఏదో ఒక పోస్ట్ చేసి, ఆయా హీరోల అభిమానులను ఖుషి చేస్తుంటాడు. అందుకే ఆయనంటే అందరికీ ఇష్టం. ప్రస్తుతం మంచు మనోజ్ విలన్ రోల్ చేసిన ‘మిరాయ్’ (Mirai Movie) సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బ్లాక్ స్వార్డ్ అనే పవర్ ఫుల్ రోల్‌లో మనోజ్ కనిపించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..