andesri
Politics

AndeSri: జాతికి అంకితం.. ‘జయజయహే తెలంగాణ’ గీతం.. ఇక్కడ వినండి

అందె శ్రీ రాసిన జయజయమే తెలంగాణ గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నది. ఈ వేడుకల్లోనే రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇప్పటి వరకు తెలంగాణకు అధికారికంగా రాష్ట్ర గీతం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు తరుచూ తలుచుకున్న జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఈ పాటను ఆవిష్కరించారు.

పరేడ్ గ్రౌండ్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జయజయహే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించారు. అందె శ్రీ రాసిన ఈ గీతాన్ని ఇటీవలే ఎంఎం కీరవాణి స్వరపరిచారు. ఈ గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డికి జాతికి అంకితం చేస్తుండగా గీత రచయిత అందెశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. ఎంఎం కీరవాణి కొత్త ట్యూన్‌లో మ్యూజిక్‌తో పాటు ఆ పాటను వింటూ అందె శ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. జై తెలంగాణ అంటూ చేతులెత్తి నినదించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఇంతకీ ఎంఎం కీరవాణి కొత్త ట్యూన్‌లో ప్రభుత్వం ఆవిష్కరించిన జయజయహే తెలంగాణ గీతాన్ని విన్నారా? ఇక్కడ వినండి.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?