TG Electricity (imagecredit:twitter)
తెలంగాణ

TG Electricity: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం హైక్.. వివరాలు ఇలా..?

TG Electricity: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గతంకంటే విపరీతంగా డిమాండ్ హైక్ అవుతోంది. తెలంగాణ(Telangana)లో నీటి లభ్యత గతం కంటే పెరగడంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈనేపథ్యంలో రాష్​ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విద్యుత్ వాడకం ఎక్కువగా నమోదవుతోంది. గతేడాది 8848 మెగావాట్ల వినియోగం ఉండగా.. పలు జిల్లాల్లో ఎన్నడూ లేనిది విద్యుత్ వినియోగం 12610 మెగావాట్లకు చేరుకోవడం గమనార్హం. గతేడాదితో పోల్చుకుంటే ఇందులో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇటీవల భారీగా వర్షాలు కురిసినా విద్యుత్ సరఫరాలో అంతరాయాల పునరుద్ధరణను శాఖ వేగవంతంగా చేపట్టడం గమనార్హం.

విద్యుత్ డిమాండ్ భారీగా..

తెలంగాణ వ్యాప్తంగా అధికారికంగా, అనధికారికంగా కలిపి మొత్తం దాదాపు 30 లక్షల బోర్లు వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీడీసీఎల(SPDCL) పరిధిలో దాదాపు 16 లక్షల బోర్లు ఉన్నట్లు సమాచారం. కాగా ఎన్పీడీసీఎల్ పరిధిలో దాదాపు 14 లక్షలుగా ఉన్నట్లు చెబుతున్నారు. అధికారికంగా అనధికారికంగా కలిపి మొత్తం 30 లక్షల బోర్డు వినియోగంలో ఉన్న ఈనేపథ్యంలో కరెంట్ వాడకం జిల్లాలో ఎక్కువైంది. అందుకే విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగేందుకు కారణమైంది. డిమాండ్ ఎంత పెరిగినా అందుకు అనుగుణంగా అందించేందుకు విద్యుత్ అధికారులు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. సర్కార్ సైతం అందుకు సిద్ధంగానే ఉందని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka Mallu) పలు సందర్భాల్లోనూ ప్రస్తావించారు.

Also Read: Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ వాడకం

నెల 2024 2025

సెప్టెంబర్ 1 7,401 మె.వా(158.2 మి.యూ) 12,146 మె.వా(237.5 మి.యూ)

సెప్టెంబర్ 2 8,361 మె.వా(171.2 మి.యూ) 12,542 మె.వా(240.67 మి.యూ)

సెప్టెంబర్ 3 8,848 మె.వా(182.2 మి.యూ) 12,610 మె.వా(246.6 మి.యూ)

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో

నెల 2024 2025

సెప్టెంబర్ 1 674 మె.వా(13.6 మి.యూ) 1839 మె.వా(33.8 మి.యూ)

సెప్టెంబర్ 2 950 మె.వా(18.1 మి.యూ) 2011 మె.వా(34.6 మి.యూ)

సెప్టెంబర్ 3 1120 మె.వా(21.8 మి.యూ) 1971 మె.వా(35.1 మి.యూ)

ఉమ్మడి మెదక్ జిల్లాలో

నెల 2024 2025

సెప్టెంబర్ 1 1210 మె.వా(26.0 మి.యూ) 2117 మె.వా(44.0 మి.యూ)

సెప్టెంబర్ 2 1575 మె.వా(33.2 మి.యూ) 2136 మె.వా(42.7 మి.యూ)

సెప్టెంబర్ 3 1678 మె.వా(36.0 మి.యూ) 2105 మె.వా(43.5 మి.యూ)

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో

నెల 2024 2025

సెప్టెంబర్ 1 692 మె.వా(14.9 మి.యూ) 1361 మె.వా(24.5 మి.యూ)

సెప్టెంబర్ 2 782 మె.వా(15.5 మి.యూ) 1557 మె.వా(28 మి.యూ)

సెప్టెంబర్ 3 781 మె.వా(16.1 మి.యూ) 1477 మె.వా(26.8 మి.యూ)

Also Read; Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Just In

01

Manoj Manchu: ‘మిరాయ్’ ఈవెంట్‌లో మనోజ్ మంచు ‘ఓజీ’ ప్రమోషన్.. ఇది వేరే లెవల్ అంతే!

Chanakya Niti: మీ బంధువులకు ఈ విషయాలు అస్సలు చెప్పకూడదని తెలుసా..

Pawan Kalyan: అల్లు అరవింద్ మదర్ పవన్ కళ్యాణ్‌ని ఏమని పిలిచే వారో తెలుసా?

Vimal Krishna: ‘డీజే టిల్లు’ దర్శకుడి తర్వాత చిత్రం, హీరో.. డిటైల్స్ ఇవే!

Hyderabad Collector: ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన.. జిల్లా కలెక్టర్ హరిచందన