Sahu Garapati
ఎంటర్‌టైన్మెంట్

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!

Sahu Garapati: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) హీరోగా రూపుదిద్దుకున్న మిస్టీరియస్ కల్ట్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి (Sahu Garapati) నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ‘మిరాయ్’కి పోటీగా విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత సాహు గారపాటి మీడియాకు చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ..

కథ యూనిక్‌గా ఉంటుంది

‘‘డైరెక్టర్ కౌశిక్ ఈ ‘కిష్కింధపురి’ కథని గత ఏడాది ఫిబ్రవరిలో నాకు చెప్పారు. వినగానే నాకు నచ్చింది. జూలై నుంచి షూటింగు మొదలెట్టాం. చాలా ఇంట్రెస్టింగ్ హారర్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథ ఇది. ఇప్పటివరకు ఎన్నో హారర్ కథలు వచ్చాయి. అయితే ఈ కథ మాత్రం చాలా యూనిక్‌గా ఉంటుంది. హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ ఈ రెండింటి బ్లెండ్‌తో చాలా కొత్తగా ఈ కథని మలిచాడు దర్శకుడు. ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్.. దాని చుట్టూ ఉండే హారర్ ఎలిమెంట్స్‌ని చాలా అద్భుతంగా ఈ సినిమాలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇలాంటి హారర్ థ్రిల్లర్ రాలేదని మాత్రం చెప్పగలను.

Also Read- Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

ఎక్జయిట్ అయ్యాను

ఒక కథ విన్నప్పుడు నాకు ఆసక్తి కలగాలి.. ఇలాంటి పాయింట్ ఇప్పటివరకు రాలేదనిపిస్తే.. అలాంటి పాయింట్‌తో సినిమా చేయాలనే భావిస్తాను. కమర్షియల్, ఫ్యామిలీ కథలకు కాంబినేషన్ చూస్తాం గానీ.. ఇలాంటి కథకు మాత్రం అందులో ఉన్న యూనిక్ పాయింట్ ఏమిటనేదే చూస్తాం. ఈ కథ విన్నప్పుడు నేను ఎంత ఎక్జయిట్ అయ్యానో.. సినిమా చూసిన తర్వాత అది డబుల్ అయింది. ఈ సినిమాకు ‘యానిమల్, పుష్ప’ సినిమాలకు పని చేసిన టెక్నీషియన్స్ పని చేశారు. అలాగే చిత్ర రన్ టైమ్ కూడా చాలా క్రిస్ప్‌గా ఉంటుంది. ఈ మధ్య ఆడియెన్స్ ఇది బాగా చూస్తున్నారు. ఆ విషయంలో ప్రేక్షకులను ఈ సినిమా చక్కగా ఎంగేజ్ చేస్తుందని భావిస్తున్నాను.

Also Read- Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?

షాక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయ్..

హీరో సాయి ఇప్పటి వరకు కమర్షియల్ మాస్ సినిమాలు చేశారు. ఈ సినిమాలో ఆయన ప్రజెన్స్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ కథకి ఆయన పూర్తి న్యాయం చేశారని చెప్పగలను. ఇందులో రెండు యాక్షన్ సీక్వెన్స్‌లు సూపర్బ్‌గా ఉంటాయి. కిష్కింధపురి అనే ఒక ఊర్లో జరిగే కథ ఇది. అందుకే ఈ సినిమాకు అదే టైటిల్ పెట్టడం జరిగింది. ఫస్ట్ హాఫ్ కొంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సెకండాఫ్ నుంచి సీరియస్ హారర్ ఫిల్మ్‌గా ఈ సినిమా టర్న్ అవుతుంది. ఈ సినిమ బిజినెస్ విషయంలో మేము చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాము. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తప్పకుండా మంచి థ్రిల్ ఫీల్ అవుతారు. విజువల్ , మ్యూజికల్‌గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో చాలా షాక్ ఫ్యాక్టర్స్, ఆడియన్స్ భయపడే సన్నివేశాలు వున్నాయి. హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెన్సార్ నుంచి ఎలాంటి కట్స్ రాలేదు. సీరియస్ హారర్ సినిమాని చాలా ఎంగేజింగ్‌గా చేశారు, చాలా బాగుందని అన్నారు. ఈ సినిమాకు ప్రీమియర్స్ వేయాలనే ఆలోచనలో ఉన్నాం. సోమవారం ఫైనల్ అవుతుంది’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!