BRS Meet
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

KCR KTR Harish Meet: తాజా రాజకీయాలపై సుదీర్ఘ మంతనాలు
కేసీఆర్‌తో హరీష్ రావు, కేటీఆర్ సమావేశం
కాళేశ్వరంపై దర్యాప్తు సీబీఐకి అప్పగింత, కవిత వ్యవహారంపై చర్చలు 
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనా చర్చించిన అధినేత

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక ఎన్నికలపైనే నేతలంతా దృష్టిసారించాలని, మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నేతలతో భేటీ (KCR KTR Harish Meet) అయ్యారు. సుమారు నాలుగు గంటలపాటు సుధీర్ఘంగా చర్చించారు. తాజా రాజకీయాలు, కాళేశ్వరంపై దర్యాప్తు సీబీఐకి అప్పగింత, కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామా వ్యవహారం, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం, కాంగ్రెస్, బీజేపీలు అనుసరిస్తున్న విధానం, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై చర్చించినట్లు సమాచారం. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు సైతం చర్చకు వచ్చినట్లు తెలిసింది.

Read Also- Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, డివిజన్ పార్టీ కమిటీ, ఇన్‌ఛార్జులతో చర్చించిన అంశాలను సైతం ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంభీపూర్ రాజు వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని, వాటిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని దిశానిర్దేశనం చేశారు. ప్రభుత్వాల తప్పిదాలు పార్టీకి కలిసి వస్తాయని అన్నారు. సమస్యలపై దూకుడు పెంచాలని, కేడర్‌ను సైతం త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేయాలని సూచించారు.

Read Also- Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

నేతలంతా ప్రణాళికలతో ముందుకు సాగాలని కేసీఆర్ సూచించారు. నేతలు కోఆర్డినేషన్‌తో పనిచేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలన్నా వారి దగ్గర ఆధారాలే లేవని, వారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని, అదంతా వారికి పాలన చేతగానేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని, పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ సంతోష్ రావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!