Srinivas Goud: వైన్స్ షాపుల్లో 25శాతం గౌడ్లకు ఇవ్వాల్సిందేనని లేకుంటే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) హెచ్చరించారు. హైదరాబాద్ లో కల్లుగీత సంఘాలట సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల సాధన, తదుపరి కార్యాచరణ, పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు
నందనం నీరా ప్రాజెక్టు సందర్శిస్తాం
త్వరలోనే నందనం నీరా ప్రాజెక్టు సందర్శిస్తామని వెల్లడించారు. త్వరలోనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మస్థలం కిలాషా పూర్ కు కార్ల ర్యాలీకి వెళ్లనున్నట్లు తెలిపారు. అదే విధంగా గౌడ సంఘాలతో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, గౌడ కలుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్న గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. దుర్గయ్య గౌడ్, కల్లు దుకాణాల రక్షణ కమిటీ నాయకుడు సురేష్ గౌడ్, బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నాగేశ్వర్ గౌడ్, గౌడ కలుగీత వృత్తిదారుల సంఘం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కేశమోని శ్రీనివాస్ గౌడ్, మూల మనోహర్ గౌడ్, చింతల్ బస్తీ అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!