Bhatti Vikramarka (imagecredit:swetcha)
తెలంగాణ

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Bhatti Vikramarka: రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్(Young India Integrated Residential Schools ను ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramaraka) అన్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల పెట్టుబడితో ఒక్కో పాఠశాల నిర్మిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 104 పాఠశాలల నిర్మాణం ప్రారంభించినట్టు తెలిపారు. విద్యార్థులు కళాశాల బయటికి వెళ్లగానే ఉద్యోగం పొందేలా స్కిల్ యూనివర్సిటీలో సిలబస్ రూపొందించి అమలు చేస్తున్నట్టు తెలిపారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్

స్కిల్ యూనివర్సిటీలో సిలబస్ ఎలా ఉండాలి అనేది పారిశ్రామికవేత్తలతో మాట్లాడి డిజైన్ చేసినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(Indian School of Business)లో మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్(Motilal Oswal Executive Centre) ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యువ రాష్ట్రమని, అయినా ప్రపంచంతో పోటీపడుతోందని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి ISB విద్యార్థులు సహకరించాలని డిప్యూటీ సీఎం కోరారు. తెలంగాణ రైజింగ్-2047, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ యువ రాష్ట్రం వేగంగా పరుగులు తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ఎవరూ ఊహించని రీతిలో పెట్టుబడులు పెడుతోందన్నారు.

Also Read: Ponnam Prabhakar: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పక్కా.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

చాకలి ఐలమ్మ పేరిట మహిళా యూనివర్సిటీ

విద్యపై పెట్టుబడి రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగపడుతుందని వివరించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న చాకలి ఐలమ్మ(Chakali Ailamma) పేరిట మహిళా యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) వంటి దిగ్గజాన్ని చైర్మన్ గా నియమించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ఐఎస్ బీ నిర్వాహకులు ఈ స్కిల్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను సందర్శించి వాటికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరారు. అవి ప్రారంభ దశలో ఉన్నందున ఐఎస్ బీ నుంచి సూచనలు అందితే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆశయాలు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సెంటర్ భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మారి నూతన ఆవిష్కరణల వైపు దారి చూపాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Also Read: Prabhas: అనుష్క కోసం ప్రభాస్.. ఇది ప్రేమా లేక ఫ్రెండ్షిప్పా?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్