Ganesh immersion 2025 (image source: Twitter)
తెలంగాణ

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Ganesh Nimajjanam 2025: తెలంగాణలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. నిమజ్జనానికి ఇవాళే ఆఖరి రోజు కావడంతో పెద్ద ఎత్తున గణనాథుని విగ్రహాలు.. నిమజ్జన ప్రాంతాలకు తరళివెళ్తున్నాయి. అటు హైదరాబాద్ లో అతి భారీ ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి బయలుదేరాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా చూసిన గణేష్ నిమజ్జనం సందడి నెలకొంది. ఇలాంటి సమయంలో పలు ప్రాంతాల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. యాదాద్రి, మెదక్ జిల్లాలతో పాటు.. హైదరాబాద్ సరూర్ నగర్ లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

క్రేన్ తీగలు ఒక్కసారిగా తెగి..
యాదాద్రి భువనగిరి జిల్లాలో వినాయక నిమజ్జనం (Ganesh Nimajjanam) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి భువనగిరి చెరువు వద్ద ఓ గణనాథుడ్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో విషాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి భువనగిరి చెరువు వద్దకు ఓ గణపయ్యను ట్రాక్టర్ లో తీసుకొచ్చారు. నిమజ్జనం చేసేందుకు క్రేన్ సాయంతో వినాయకుడ్ని పైకి ఎత్తారు. ఈ క్రమంలో ఒక్కసారిగా క్రేన్ తాడు తెగి.. గణేశుని విగ్రహం ట్రాక్టర్ మీద పడిపోయింది. దీంతో ట్రాక్టర్ లో కూర్చున్న ఇద్దరు భక్తులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. వారిని హుటాహుటీనా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గణనాథుడు విగ్రహం పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

సరూర్ నగర్ లోనూ..
మరోవైపు హైదరాబద్ లోని సరూర్ నగర్ లోనూ ఈ తరహా ఘటనే జరిగింది. గణేశ్ ప్రతిమను క్రేన్ సాయంతో పైకి లేపుతుండగా.. తీగలు ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో గణనాథుడి విగ్రహం అమాంతం కిందపడిపోయింది. అయితే విగ్రహం పడ్డ చోట ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. తర్వాత విగ్రహాన్ని జాగ్రత్తగా పైకి తిరిగి నిమజ్జన ప్రక్రియను నిర్వాహకులు పూర్తి చేయడం గమనార్హం. అటు మెదక్ లోని హవేలీ ఘనపూర్ మండలంలో వినాయక నిమజ్జనంలో ప్రమాదం చోటుచేసుకుంది. సుధాకర్ (17) అనే యువకుడు రామస్వామి కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. రామస్వామి కుంటలో నిమజ్జానికి వెళ్లిన యువకుడు.. కనిపించకుండా పోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజఈతగాళ్లను రంగంలోకి దింపి.. కుంటలో వెతకగా సుధాకర్ మృతదేహం లభ్యమైంది.

Also Read: Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

గంగనదిలో కొట్టుకుపోయిన వ్యక్తి
ఇదిలా ఉంటే హరిద్వార్ లోనూ గణపతి నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఓ భక్తుడు గంగానదిలో కొట్టుకుపోయాడు. అతడ్ని నిఖిల్ గుప్తా (38)గా స్థానికులు పేర్కొన్నారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో నిఖిల్ నదిలోకి దిగాడు. పొరపాటున నీళ్లలో పడిపోయి కొట్టుకుపోయాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కాపాడేందుకు ఎవరు సాహసం చేయలేకపోయారు. నిఖిల్ గుప్తా ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలిపాయి. మరోవైపు నిఖిల్ గుప్తాకు ఏమైందో తెలియక అతడి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

Also Read: Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!