tdp alliance to form government in andhra pradesh exit polls forecasts | Exit Polls: ఆంధ్రప్రదేశ్‌ కూటమిదే
chandrababu naidu
Political News

Exit Polls: ఆంధ్రప్రదేశ్‌ కూటమిదే

– మెజార్టీ సర్వేలు టీడీపీ కూటమికే మొగ్గు
– మ్యాజిక్ ఫిగర్ కంటే గణనీయంగా సీట్లు
– లోక్ సభ ఎన్నికల్లోనూ అదే హవా

Andhra Pradesh: లోక్ సభ ఎన్నికల చిట్టచివరి దశ ఎన్నికలు ముగియడంతో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. రసవత్తర పోటీ నడుమ జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్‌ అంచనాలు ఆసక్తిని రేపాయి. ఈ సారి ఏపీలో ప్రభుత్వం మారడం ఖాయం అని, కూటమికే మెజార్టీ సీట్లు వస్తాయని మెజార్టీ సర్వేలు అంచనా వేశాయి. బిగ్ టీవీ, పీపుల్స్ పల్స్, చాణక్య స్ట్రాటజీస్, పయనీర్, జనగళం, రైజ్, కేకే సర్వేలు వంటివన్నీ టీడీపీ కూటమికే మొగ్గు చూపాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 110 స్థానాల కంటే ఎక్కువ సీట్లే వస్తాయని ఈ సర్వేలన్నీ పేర్కొన్నాయి. చాలా సర్వేలు వైసీపీ 50 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేశాయి. కాగా, ఆరా మస్తాన్ సర్వే మాత్రం వైసీపీకి మొగ్గు చూపింది. ఆరా మస్తాన్, పార్థా చాణక్య, పోల్ స్ట్రాటజీ సర్వేలు మాత్రం వైసీపీకి 100కు అటూ ఇటూగా అసెంబ్లీ సీట్లు దక్కుతాయని తెలిపాయి. ఈ సర్వేలు ఎంపీ సీట్లు కూడా వైసీపీ వైపే మొగ్గుచూపుతూ అంచనాలు ఇచ్చాయి.

ఏపీలో వైనాట్ 175 అనే స్లోగన్‌తో బరిలోకి దిగిన వైసీపీకి ఈ సారి శృంగభంగం తప్పదన్నట్టుగా మెజార్టీ సర్వేలు తెలిపాయి. ఈ అంచనాలు చూస్తే వైసీపీ టార్గెట్ తప్పుతుందని అర్థం అవుతున్నది.

ఎన్డీయే హ్యాట్రిక్:

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి కొలువుదీరుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇచ్చాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వన్ సైడెడ్‌గా ఎన్డీయే కూటమే మెజార్టీ లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపాయి. 350 సీట్లకు తగ్గకుండా ఎన్డీయే గెలుస్తుందని మెజార్టీ సర్వేలు వెల్లడించాయి. యూపీలో బీజేపీ కొన్ని సీట్లు తగ్గినా 65 కంటే ఎక్కువ గెలుచుకుంటుందని తెలిపాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్డీయే కూటమి మెరుగైన ఫలితాలను రాబడుతున్నట్టు ఈ అంచనాలు వివరించాయి.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..