Minister Sridhar Babu (imagecredit:twitter)
తెలంగాణ

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

Minister Sridhar Babu: ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ వీకెండ్ దుబాయి 2025’లో భాగంగా యూఏఈ(UAE)లో నిర్వహించిన సౌత్ ఇండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డు(సైబా)ల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణ పురోగతిని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

దేశ జీడీపీలో మా వాటా

‘భౌగోళిక విస్తీర్ణంలో 11, జనాభా పరంగా తెలంగాణ 12వ స్థానంలో ఉందన్నారు. దేశ జీడీపీలో మా వాటా 5 శాతం కంటే ఎక్కువే అన్నారు. 202425 ఆర్థిక సంవత్సరంలో జీఎస్ డీపీ(GSDP) వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైందన్నారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ అన్నారు. గత 18 నెలల్లో తెలంగాణ లైఫ్ సైన్సెస్(Telangana Life Sciences), ఈవీ, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, ఏఐ(AI), పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో రూ.3.28 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని చెప్పారు. ఎలీ లిల్లీ లాంటి అనేక ప్రపంచ దిగ్గజ సంస్థలు తెలంగాణ(Telangana)ను తమ గమ్యస్థానంగా మార్చుకున్నాయని, ఇప్పటికే యూఏఈ పెట్టుబడిదారులు రూ.2వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారన్నారు.

Also Read: KTR: బీఆర్ఎస్ పూర్తి పగ్గాలు ఆయనకే.. గులాబీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..!

వాణిజ్య సంబంధాలకు చిహ్నం

ఇది తెలంగాణ – దుబాయ్ మధ్య రోజురోజుకీ బలపడుతున్న వాణిజ్య సంబంధాలకు చిహ్నంగా భావిస్తున్నామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారిని మేం కేవలం వ్యాపారవేత్తలుగా మాత్రమే చూడటం లేదు. మా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామిగా పరిగణిస్తున్నామన్నారు. ఏఐ(AI), ఎమర్జింగ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ(Cyber ​​Security), ఫిన్‌టెక్, డిజిటల్ ఎకానమీ(Digital economy), స్మార్ట్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, లాజిస్టిక్స్, వేర్ హౌజింగ్, ట్రేడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఈవీ, ఏరో స్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని, తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Also Read: Madhya Pradesh: అత్యంత ఘోరం.. బాలికపై 2 సార్లు అత్యాచారం.. బెయిల్‌పై వచ్చి మరి!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!