Revanth Reddy
Politics

CM Revanth Reddy: కాకతీయుల చేతిలో చనిపోయిన సమ్మక్మ, సారక్కవైపే ఉంటా..

Telangana Formation Day: సమ్మక్క, సారలమ్మలు అప్పటి కాకతీయ పాలకులపై ధిక్కారాన్ని చూపారని, అందుకే కాకతీయులు సమ్మక్క, సారలమ్మలను చంపేశారని సీఎం రేవంత్ రెడ్డి చరిత్రను గుర్తు చేశారు. కాకతీయుల చేతిలో మరణించిన సమ్మక్క, సారలమ్మల వైపే తాను నిలబడతానని స్పష్టం చేశారు. సమ్మక్క, సారలమ్మ, జంపన్నలను చంపిన రాజులుగానే కాకతీయులను చూస్తానని చెప్పారు. కానీ, సీఎం కేసీఆర్‌కు అమరవీరులంటే ద్వేషం అని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంపైనా ఆయనకు గౌరవం లేదని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల కోసం బీఆర్ఎస్‌తోపాటు బీజేపీకి నేతలకూ ప్రత్యేక ఆహ్వానాన్ని పంపామని వివరించారు. బీజేపీ తమ ఆహ్వానాన్ని తిరస్కరించలేదని తెలిపారు.

2015లో 1000 కోట్లతో అమరవీరుల స్థూపాన్ని కట్టాలని తొలిసారిగా డిమాండ్ చేసింది తాననే రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ వెల్లడించారు. స్వాతంత్ర్యం దినోత్సవం పాకిస్తాన్‌ ఒక రోజు ముందు జరుపుకున్నట్టే కేసీఆర్ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఒక రోజు ముందే సంబురాలు చేస్తున్నారని, రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఆయనకు గౌరవం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా.. కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలకు రావాల్సిందని అభిప్రాయపడ్డారు. అఖిలపక్షంలో పిలుద్దామనుకుంటే కేసీార్ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాడని సెటైర్ వేశారు. పది సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు తన ఆధ్వర్యంలో జరగడం తన జీవిత కాల గుర్తు అని వివరించారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతూ.. ఈ విగ్రహం సెక్రెటేరియట్ బయట కాదు.. సెక్రెటేరియట్ లోపల ఉంటుందని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఒక నిరంతర ప్రక్రియ అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత డ్రగ్ కంట్రోల్ అని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం 1508 బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారని చెప్పారు. నయీం కేసుపై చర్చ మొదలు కాలేదని తెలిపారు. టీపీసీసీ చీఫ్‌గా తన పదవీ కాలం ముగుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త పీసీసీ వస్తాడని, ప్రముఖ నాయకుడే పీసీసీ చీఫ్‌గా వస్తారని వివరించారు. ఇందులో ఏఐసీసీదే తుది నిర్ణయం అని చెప్పారు.

ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్న కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమేనని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 9 నుంచి 12 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని వివరించారు. రెండు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుస్తామని అంచనా వేశారు. కంటోన్మెంట్ శాసన సభ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ, ఉమ్మడి నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికీ ఎన్నిక జరిగింది.

బీసీ కుల గణన చేయడానికి ఆదేశాలు జారీ చేశామని, త్వరలోనే కుల గణన ప్రారంభం అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్య, స్పోర్ట్స్ ప్రోత్సహించాలని అనుకుంటున్నట్టు వివరించారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?