Min Sridhar Babu (imagecredit:swetcha)
తెలంగాణ

Min Sridhar Babu: గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

Min Sridhar Babu: తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్(Global Digital), ఇన్నోవేషన్ హబ్‌(Innovation Hub)’ గా మార్చాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో యూఏఈ భాగస్వామ్యం కావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) కోరారు. యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఏఐ, డిజిటల్ ఎకానమీ అండ్ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామాతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణను ‘ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’ గా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న ఏఐ సిటీ (AI City), ఏఐ యూనివర్సిటీ(AI Univercity), ఏఐ ఇన్నోవేషన్ హబ్ తదితర ప్రాజెక్టులపై శ్రీధర్ బాబు వివరించారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ‘తెలంగాణ డేటా ఎక్స్ ఛేంజ్’ వల్ల ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రభుత్వ పాలన తదితర రంగాల్లో కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు.

యూఏఈ సావరిన్ ఫండ్స్

హైదరాబాద్ లో తెలంగాణ భాగస్వామ్యంతో ‘ఏఐ’(AI) ఆర్అండ్ డీ సెంటర్ ను ప్రారంభించేందుకు ముందుకు రావాలని యూఏఈ మంత్రి ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామాను ఆహ్వానించారు. తెలంగాణ భారతదేశంలో నాలుగో అతిపెద్ద యూఏఐ ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. డీప్-టెక్, ఏఐ స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ సావరిన్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ సంస్థలకు మంచి అవకాశాలు ఉన్నాయని సూచించారు. ‘ఏఐ, స్టార్టప్ సమ్మిట్’ను యూఏఈతో కలిసి నిర్వహించేందుకు తెలంగాణ ఆసక్తిగా ఉందని, ఇందుకు సహకరించాలని కోరారు. స్మార్ట్ మొబిలిటీ, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, గృహ నిర్మాణం, ఇ-గవర్నెన్స్‌ తదితర రంగాల్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ సంస్థలు మంచి అవకాశాలున్నాయని చెప్పారు.

Also Read: Samantha: సమంతా షేర్ చేసిన రీల్‌ వైరల్.. ఈ సారి వదలదా!

భాగస్వామ్యం అవ్వండి

తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్’ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూఏఐ మంత్రి ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామా ప్రశంసించారు. ఏఐ((A), డిజిటల్ ఎకానమీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, గేమింగ్‌ తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 100 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో యూఏఈ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఏఐ ఆధారిత ‘స్టార్ గేట్’ ప్రాజెక్టు గురించి మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణ కీలక భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. త్వరలో యూఏఐలో నిర్వహించనున్న ‘ఫిన్ టెక్ స్టార్టప్స్’ సమ్మిట్ లో తెలంగాణ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు.

Also Read: BRS: జూబ్లీహిల్స్‌కు గులాబీ సన్నద్ధం?.. పోలింగ్ బూతులవారీగా త్వరలో సమీక్షలు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?