Sivakarthikeyan
ఎంటర్‌టైన్మెంట్

Sivakarthikeyan: ‘మదరాసి’ సినిమాకు ఫోర్ పిల్లర్స్ ఏమేంటంటే..

Sivakarthikeyan: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘మదరాసి’ (Madharaasi). ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5 థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేయగా.. తాజాగా హీరో శివకార్తికేయన్ ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..

లవ్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ 

‘‘మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) వంటి పెద్ద స్టార్స్‌ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మురుగదాస్. ఆయన ఎప్పుడూ చాలా కూల్‌గా ఉంటారు. అదే సమయంలో చాలా క్లారిటీతో ఉంటారు. ఉంటుంది. చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఈ సినిమా షూటింగ్ అంతా చాలా మంచి వాతావరణంలో జరిగింది. నాకో సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు. ఈ సినిమాలో లవ్, యాక్షన్ అనేవి రెండు పిల్లర్స్. అందులో లవ్ పోర్షన్ అద్భుతంగా రావడానికి రుక్మిణి వసంత్ ఎంతగానో సపోర్ట్ చేసింది. ఈ సినిమాలో తన పాత్ర చాలా కీలకం. కథకి ఎమోషన్ యాడ్ చేసే రోల్ తనది. తన పెర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్ ఎసెట్. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ఇస్తుంది. ఇందులో ప్రేమ కథ మాత్రమే కాదు.. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఎమోషన్, యాక్షన్, కాన్వాస్ పరంగా ప్రేక్షకులకు బిగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా ఇది. ముఖ్యంగా యాక్షన్‌లో మ్యాడ్ నెస్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. బిగ్ స్క్రీన్ పై సెలబ్రేట్ చేసుకునేలా ఈ సినిమా వుంటుంది.

Also Read- Allu Arjun and Anushka: ‘పుష్ప’ యూనివర్స్‌లో ‘ఘాటి’ కూడా భాగమా?.. పుష్పరాజ్‌తో షీలావతి!

టెక్నికల్‌గా అత్యున్నతంగా..

అనిరుధ్, నేను బెస్ట్ ఫ్రెండ్స్. మా కాంబినేషన్‌లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా మ్యూజికల్‌గా అద్భుతంగా వచ్చింది. అనిరుధ్ బిట్స్ హెవీగా ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక లెగ్ మూమెంట్ ఉన్న సాంగ్ చేశా. అలాగే రీరికార్డింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అరుణ్ వెంజరమూడు వర్క్ ప్రొడక్షన్ డిజైనింగ్.. అన్నీ కలగలిపి టెక్నికల్‌గా ఈ సినిమాను అత్యున్నతంగా తీర్చిదిద్దాం. నిర్మాత తిరుపతి ప్రసాద్ చాలా సింపుల్ పర్సన్. కంటెంట్ ఉంటే ఎంతైనా ఖర్చు చేస్తారు. ఆయనలో ఆ క్వాలిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకు ఎక్కడా రాజీ పడకుండా గ్రేట్ ప్యాషన్‌తో, గ్రాండ్ స్కేల్‌లో తీశారు.

Also Read- Tunnel Telugu Trailer: అథర్వా మురళీ, లావణ్య త్రిపాఠిల ‘టన్నెల్‌’ ట్రైలర్ ఎలా ఉందంటే?

మరో రెండు పిల్లర్స్

బీజు మీనన్, విద్యుత్ జమ్వాల్ ఈ సినిమాలో మరో రెండు పిల్లర్స్. విద్యుత్ జమ్వాల్‌తో చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా క్రేజీగా ఉంటాయి. బీజు మీనన్ గురించి చెప్పేదేముంది. ఆయన అద్భుతమైన యాక్టర్. వాయిస్ మ్యాడులేషన్‌తో ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాతో ఆయన్ని చాలా దగ్గర నుంచి గమనించే అవకాశం దొరికింది. తెలుగు, తమిళ్ ఆడియన్స్‌కి డిఫరెన్స్ ఏం లేదు. సినిమా బాగుంటే అందరూ సినిమాని ప్రేమిస్తారు. తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచులు దాదాపు ఒకేలా వుంటాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా సినిమా బావుంటే.. ప్రతి సినిమాని ఆదరిస్తారు. వాళ్ళకి మంచి సినిమానా, కాదా అనేదే ముఖ్యం. ఇప్పటివరకు నా సినిమాలు ‘రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, మహావీరుడు, అమరన్’కు మంచి సపోర్ట్ ఇచ్చారు. అద్భుతమైన కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అని శివకార్తికేయన్ తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్