allari-naresh(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Allari Naresh: మత్తెక్కిస్తున్న ‘ఆల్కహాల్’ టీజర్.. పర్ఫామెన్స్ చింపేశాడు భయ్యా..

Allari Naresh: అల్లరి నరేష్ అదిరిపోయే ట్రీట్ తో మరోసారి అభిమానుల ముందుకు రాబోతున్నాడు. తాజా ఆయన నటిస్తున్న ‘ఆల్కహాల్’ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు నిర్మాతలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో ‘ఫ్యామిలీ డ్రామా’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈ సినిమా ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది, అల్లరి నరేష్ మార్కు హాస్యంతో పాటు కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1 జనవరి, 2026 న విడుదల చేయనున్నారు నిర్మాతలు.

Read also-Little Hearts Hero: ఎప్పుడో, ఎవరినో, ఏదో అన్నానని బాయ్‌కాట్ అంటున్నారు.. అసలు మీరు మనుషులేనా?

‘ఆల్కహాల్’ చిత్రం టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది, ఇది అల్లరి నరేష్ గతంలో టచ్ చేయని జానర్‌లో రూపొందుతోందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్లు సమాచారం. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. అల్లరి నరేష్ ఈ చిత్రంలో తన సహజమైన హాస్య నటనతో పాటు కొత్త రకం పాత్రలో కనిపించనున్నారు. గతంలో ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘ఉగ్రం’ వంటి చిత్రాలతో సీరియస్ రోల్స్‌లో విజయం సాధించిన నరేష్, ‘బచ్చలమల్లి’తో కామెడీలో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ‘ఆల్కహాల్’తో మరోసారి తన హాస్య ప్రతిభను చాటి, అభిమానులను అలరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read also-Mahabubabad District: లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించొద్దని ఎల్‌హెచ్‌పీఎస్ డిమాండ్

టీజర్‌ను చూస్తుంటే.. లక్షలు లక్షలు సంపాదిస్తావు మందు తాగవు ఇంకెందుకురా నీ బతుకు అంటూ కమెడియన్ సత్య వాయిస్ తోమొదలవుతోంది టీజర్. అసలు తాగుడుకు సంపాదనకు లింకేముంది సారి అంటాడు అల్లరి నరేష్. ఇందులో అల్లరి నరేష్ మందు తాగని వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కమెడియన్ సత్య నరేష్ తో మందు తాగిండానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అసలు నువ్వు మందు ఎందుకు తాగవురా అని సత్య అల్లరి నరేష్ ని అడిగితే.. అల్లరి నరేష్ తాగితే మనమీద మనకు కంట్రోల్ ఉండదు సార్ మందు నన్ను కంట్రోల్ చేయడం ఇష్టం ఉండదు అని అంటాడు. అసలు నరేష్ మందు తాగాడా.. తాగిన తర్వాత ఏం చేశాడు అన్నవిషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ టీజర్ తో మరోసారి అల్లరి నరేష్ హిట్ కొట్టేశాడని అభిమానులు అంటున్నారు. నరేష్ తో సత్య కలిసి చేసిన కామెడీ వీర లెవెల్ లో ఉంది. ఈ టీజర్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?