AR Murugadoss
ఎంటర్‌టైన్మెంట్

AR Murugadoss: ఐదేళ్ల గ్యాప్‌కి కారణం ఆ ప్రాజెక్టే.. చాలా టైమ్ వేస్ట్ చేసింది

AR Murugadoss: శివ కార్తికేయన్ (Sivakarthikeyan), రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రలలో, సంచలన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) తెరకెక్కించిన చిత్రం ‘మదరాసి’ (Madharaasi). రాక్ స్టార్ అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదలయ్యేందుకు ముస్తాబైంది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్‌వి ప్రసాద్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు. మధ్యలో సడెన్‌గా ఆయన 5 సంవత్సరాల పాటు సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో కూడా చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..

‘మదరాసి’ అని టైటిల్‌ అందుకే పెట్టా

‘‘మొదటి నుంచి నేను ప్రతీ సినిమాను నా మొదటి సినిమాగానే భావిస్తాను. ఈ ‘మదరాసి’ సినిమా విడుదలవుతున్న సమయంలోనూ నేను అలాంటి ఫీలింగ్‌‌తోనే ఉన్నాను. డిఫరెంట్ కథతో అందరి ముందుకు ఈ సినిమా వస్తుంది. కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందనే కాన్ఫిడెంట్‌తో ఉన్నాను. ఈ సినిమాకు ‘మదరాసి’ అనే టైటిల్ పెట్టడానికి కారణం మామూలుగా మన దక్షిణాది వారిని ఉత్తరాదిలో ‘మదరాసి’ అని పిలుస్తుంటారు. ఈ చిత్రం ఎక్కువగా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నడుస్తుంది. ఈ మూవీలోని హీరోని విలన్ మదరాసి అని పిలుస్తుంటాడు. అందుకే టైటిల్ కూడా అదే పెట్టాం. సినిమా మొత్తం తమిళనాడు నేపథ్యంలో సాగుతుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. నేను బెంగళూరులో కథ జరుగుతుంటే ‘మదరాసి’ అని టైటిల్‌ను పెట్టలేను. తమిళనాడులో జరుగుతుంది కాబట్టే ఆ టైటిల్ పెట్టాము. అయినా ఇందులోని కంటెంట్, కథ అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్‌లో ఆల్రెడీ ఉన్న సమస్యలు, మన దేశంలోకి వస్తున్న అలాంటి ఓ కొత్త సమస్యను బేస్ చేసుకుని ఈ కథ రాసుకున్నాను. ఇందులోని సబ్జెక్ట్ చాలా డిఫరెంట్‌గా, అందరికీ సరికొత్త ఫీల్ ఇస్తుంది. అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఇందులో ఉంది. అదే ఈ సినిమాకు అందరినీ తీసుకువస్తుందిని భావిస్తున్నాను.

Also Read- Little Hearts Hero: ఎప్పుడో, ఎవరినో, ఏదో అన్నానని బాయ్‌కాట్ అంటున్నారు.. అసలు మీరు మనుషులేనా?

ఎక్కువ రీచ్ అవుతుందని..

ఈ సినిమా హీరో పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. శివ కార్తికేయన్‌కు ఈ కథ చెప్పిన వెంటనే బాగా నచ్చింది. ఆలస్యం చేయకుండా వెంటనే ఓకే చెప్పాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్‌కు మాస్‌లో మంచి ఇమేజ్ ఉంది. అలాంటి మాస్ హీరోతో ఈ పాయింట్‌ను చెబితే ఎక్కువ రీచ్ అవుతుందని భావించాను. అలాగే హీరోయిన్ రుక్మిణి వసంత్ పాత్ర చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయారు. విద్యుత్ జమ్వాల్ విషయానికి వస్తే.. ‘తుపాకి’ కథ అతనికి చెప్పినప్పుడు చాలా ఎగ్జైటై ఓకే చెప్పారు. ప్రస్తుతం ఆయన విలన్‌గా చేయడం లేదు.. హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌ కూడా చేస్తున్నారు. ఈ ‘మదరాసి’ కథను ఆయనకు చెప్పిన వెంటనే నచ్చడంతో విలన్‌గా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రంలో అనిరుధ్ అద్భుతమైన మ్యూజిక్, ఆర్ఆర్ ఇచ్చారు. నేను చేసిన సీన్లను అనిరుధ్ తన ఆర్ఆర్‌తో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. శ్రీ లక్ష్మీ మూవీస్, ఎన్వీ ప్రసాద్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయన ఈ మూవీ కోసం ఎంతో ఖర్చు పెట్టారు. అనుకున్న అవుట్ పుట్ వచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

Also Read- Sobhita Dhulipala: శోభిత ధూళిపాల మళ్లీ వార్తల్లోకి.. ఈసారి ఏం చేసిందంటే?

ఐదేళ్ల గ్యాప్‌కు కారణమిదే

అందరూ మీకు ఐదేళ్ల గ్యాప్ ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. వాస్తవానికి ఈ ఐదేళ్లలో నేను ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు. మధ్యలో ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం చాలా వర్క్ చేశాను. కానీ చివరకు అది కార్యరూపం దాల్చలేదు. టెక్నీషియన్‌గా అయితే నేను ఎప్పుడూ ఖాళీగా లేను. ఆ యానిమేషన్ ప్రాజెక్ట్ వల్లే చాలా టైమ్ వేస్ట్ అయింది. అందుకే ఈ గ్యాప్ వచ్చింది. సౌత్‌లో మన ఆడియెన్స్ సినిమాని ఎక్కువగా ప్రేమిస్తారనే విషయం తెలియంది కాదు. సినిమాను ప్రేమించే వారు, ఇష్టపడే వారు మన దగ్గరే ఎక్కువగా ఉన్నారు. ఓ నలుగురు కలిస్తే, వారి మధ్య కచ్చితంగా సినిమా ప్రస్తావన వస్తుంది. మన దగ్గర ప్రస్తుతం ప్రపంచస్థాయి కంటెంట్ ఉంది. మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ప్రస్తుతానికి నా దగ్గర చాలా ఐడియాలు, కాన్సెప్ట్‌లు ఉన్నాయి. నెక్ట్స్ నేను చేయబోయే మూవీ ఇదేనని పర్టిక్యులర్‌గా ఏమీ అనుకోలేదు. స్క్రిప్ట్ మొత్తం ఫైనలైజ్ అయ్యాకే నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రకటిస్తాను’’ అని మురుగదాస్ తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం