Little Hearts Pre Release Event
ఎంటర్‌టైన్మెంట్

Little Hearts Hero: ఎప్పుడో, ఎవరినో, ఏదో అన్నానని బాయ్‌కాట్ అంటున్నారు.. అసలు మీరు మనుషులేనా?

Little Hearts Hero: ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనూజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ హీరోయిన్ శివానీ నాగరం ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts). ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా.. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ‘లిటిల్ హార్ట్స్’ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read- Bellamkonda Sai Sreenivas: ఫోన్ చూసుకునే టైమ్ కూడా ఇవ్వదు.. అంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది

వార్నింగ్ ఇస్తున్నా..

ఈ సందర్భంగా హీరో మౌళి తనూజ్ (Mouli Tanuj) మాట్లాడుతూ.. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ వల్లే మా సినిమా ఇంతగా ప్రేక్షకులలోకి వెళ్తోంది. కానీ కొందరు సోషల్ మీడియాలో కావాలనే మా సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తూ సినిమాను బాయ్ కాట్ చేయాలని అంటున్నారు. నేను ఎప్పుడో, ఎవరినో, ఏదో అన్నానని, వారి మీద కామెంట్ చేశానని చెబుతూ.. మా ‘లిటిల్ హార్ట్స్’ మూవీకి నెగిటివ్ చేస్తున్నారు. వీళ్లంతా ఎలాంటి వాళ్లంటే.. మనలో ఒకరు ఎదుగుతుంటే కాళ్లు పట్టి కిందకు లాగే టైప్ మనుషులు. అలాంటి వారందరికీ వార్నింగ్ ఇస్తున్నా. మిమ్మల్ని మా మూవీతో నవ్విస్తా, మీ మనసులు కచ్చితంగా గెలుచుకుంటా. మీ ఫ్యామిలీతో కలిసి మా సినిమాకు వచ్చి ఎంజాయ్ చేసేలా చేస్తా. మా సినిమా చూసేందుకు థియేటర్స్‌కు రావాలని అందరినీ కోరుతున్నాను’’ అని తెలిపారు.

Also Read- Sobhita Dhulipala: శోభిత ధూళిపాల మళ్లీ వార్తల్లోకి.. ఈసారి ఏం చేసిందంటే?

బిగ్ హార్ట్ మూవీ చేయండి

ఇక ముఖ్య అతిథిగా హాజరైన హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రసంగిస్తూ.. కొన్ని సినిమాల ప్రమోషనల్ కంటెంట్ చూడగానే, వెంటనే మూవీ చూడాలని అనిపిస్తుంది. అలాంటి క్యూరియాసిటీ‌ని ‘లిటిల్ హార్ట్స్’ సినిమా క్రియేట్ చేసింది. నాకు కూడా ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని అనిపించింది. 90స్ బయోపిక్ చూశాక.. దర్శకుడు ఆదిత్య హాసన్ ఒక కొత్త తరహా ప్లెజెంట్ కామెడీ క్రియేట్ చేశాడని అనిపించింది. ఆయన నిర్మాతగా వస్తున్న ఈ సినిమా కూడా అలాగే నవ్విస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీ టీమ్ అందిరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలి. మౌళి తనూజ్ గురించి మనవాళ్లు చెప్పారు. అతని బ్యాక్ గ్రౌండ్ తెలిశాక వాళ్లు చెప్పింది నిజమేనని నాకు కూడా అర్థమైంది. మేము గతంలో ఏదైనా సినిమా చేస్తే.. రిలీజ్ కోసం సురేష్ బాబు, దిల్ రాజు వంటి వారి దగ్గరకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు బన్నీ వాస్ చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా కంటెంట్ బాగుంటే రిలీజ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇలాగే ఎప్పుడూ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా వారు రిలీజ్ చేయాలని కోరుతున్నాను. మీమర్స్ వల్లే మనందరి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంటుంది. అలాంటి మీమర్స్ మధ్య నుంచి వచ్చిన డైరెక్టర్ సాయి మార్తాండ్‌కు అందరి సపోర్ట్ ఉండాలి. సెప్టెంబర్ 5న ఈ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాను థియేటర్లలో చూసి బిగ్ హార్ట్ మూవీ చేస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?