Kishkindhapuri Trailer Launch Event
ఎంటర్‌టైన్మెంట్

Bellamkonda Sai Sreenivas: ఫోన్ చూసుకునే టైమ్ కూడా ఇవ్వదు.. అంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది

Bellamkonda Sai Sreenivas: కటౌట్ చూడడానికి ఆరడుగుల పైనే ఉంటుంది. హీరోయిజానికి కూడా తిరుగులేదు. కానీ హిట్ మాత్రం కొన్నాళ్లుగా దోబూచులాడుతోంది. అవును.. బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas)కు అర్జెంట్‌గా హిట్ కావాలి. ‘రాక్షసుడు’ తర్వాత ఆయనకు సరైన హిట్ పడలేదు. మధ్యలో బాలీవుడ్ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. రీసెంట్‌గా వచ్చిన ‘భైరవం’ మల్టీ హీరోల ప్రాజెక్ట్‌గా వచ్చి, పరవాలేదని అనిపించుకుంది కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం డిజప్పాయింటే చేసింది. ఇప్పుడాయన ఆశలన్నీ ప్రస్తుతం చేస్తున్న ‘కిష్కింధపురి’ (Kishkindhapuri)ఫైనే ఉన్నాయి. మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్‌గా ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం (సెప్టెంబర్ 3) ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఆయన యాక్టివ్ చూసిన వారంతా ఈసారి కచ్చితంగా ఆయనకు హిట్ పడుతుందని అనుకుంటున్నారు. ట్రైలర్ కూడా.. థ్రిల్లింగ్‌గా ఉండటంతో, ఈసారి ఆయనకు హిట్ వచ్చే కళే కనబడుతోంది.

Also Read- Sobhita Dhulipala: శోభిత ధూళిపాల మళ్లీ వార్తల్లోకి.. ఈసారి ఏం చేసిందంటే?

ఫోన్ చూసుకునే టైమ్ కూడా ఇవ్వదు

ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాటలు కూడా సినిమాపై క్రేజ్‌కు కారణమవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘‘ప్రేక్షకులకి మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘కిష్కింధపురి’ సినిమా చేయడం జరిగింది. మంచి సినిమా వస్తే.. తప్పకుండా జనాలు థియేటర్లకి వస్తారని నేను నమ్ముతున్నాను. ఈ ‘కిష్కింధపురి’ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకు చెబుతున్నానంటే.. మంచి థియేటర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా ఇది. మా డైరెక్టర్ అద్భుతమైన కథ రాసుకున్నారు. అందరికీ ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ని ఈ సినిమా ఇస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు ఫోన్ కూడా చూసుకునే టైమ్ ఉండదు. అంత థ్రిల్లింగ్‌గా ఈ మూవీ ఉంటుంది. నటీనటులు, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ అందరూ ది బెస్ట్ ఇచ్చారు. మా నిర్మాత సాహు ప్యాషన్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. సెప్టెంబర్ 12న ఈ సినిమా థియేటర్స్‌లో దద్దరిల్లిపోతుంది. ఆ రోజు నుంచి సినిమానే మాట్లాడుతుంది’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Ileana: మళ్లీ నటిగా మీ ముందుకు వస్తా.. కాకపోతే..? రీ ఎంట్రీపై ఇలియానా కామెంట్స్

అంచనాలకు మించి ఉంటుంది

దర్శకుడు కౌశిక్ (Koushik Pegallapati) మాట్లాడుతూ.. నిర్మాత సాహు, హీరో సాయి శ్రీనివాస్‌లకు కథ చెప్పిన వెంటనే నచ్చిందని చెప్పి, వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నామని అన్నారు. సాయి, అనుపమ కలిసి చేసిన ‘రాక్షసుడు’ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా మీ అంచనాలకు మించి ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. అందరూ థియేటర్స్‌లో చూడండి. కచ్చితంగా అందరికీ మంచి థ్రిల్ ఇచ్చే సినిమాగా ‘కిష్కింధపురి’ ఉంటుందని అన్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్