MARK Title Glimpse
ఎంటర్‌టైన్మెంట్

Mark Movie: ఇది కిచ్చా సుదీప్ ‘మార్క్’ రా.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Mark Movie: ఇటీవల ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన మలయాళం మూవీ ‘మార్కో’ ఎటువంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలియంది కాదు. అందులో రక్తం ఏరులై పారింది. ఆ తరహా చిత్రం ఈ మధ్యకాలంలోనే ‘సౌత్’‌లో రాలేదనే చెప్పుకోవాలి. ‘హిట్ 3’ కూడా ఆ సినిమాకు సరిపోనంతగా ఆ సినిమాలోని రక్తపాతం గురించి అంతా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ‘మార్కో’, ‘మార్క్’ వంటి పేర్లు వినబడితే చాలు.. అయ్యబాబోయ్ అనే పరిస్థితిని ఆ సినిమా కలగజేసింది. తాజాగా ‘ఈగ’ విలన్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeepa) ‘మార్క్’ (Mark Movie) అనే సినిమా ప్రకటించగానే.. అంతా ఇది కూడా ఆ తరహా చిత్రమే అని అదిరిపోయారు. మరోసారి బ్లడ్ బాత్‌ చూసేందుకు సిద్ధమైపోండనేలా.. టైటిల్ ప్రకటనతోనే షాకిచ్చిన చిత్రంగా సుదీప్ ‘మార్క్’ నిలిచింది. తాజాగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Ileana: మళ్లీ నటిగా మీ ముందుకు వస్తా.. కాకపోతే..? రీ ఎంట్రీపై ఇలియానా కామెంట్స్

కిచ్చా సుదీప్ 47వ చిత్రం

కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న నటుడు ‘కిచ్చా సుదీప్’. రీసెంట్‌గానే ఆయన ‘మ్యాక్స్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక్క రాత్రి జరిగే కథతో వచ్చిన ఆ సినిమా మంచి సక్సెస్‌నే అందుకుంది. ఇప్పుడు కిచ్చా సుదీప్ నటిస్తున్న 47వ చిత్రం ‘మార్క్’. ఈ సినిమాను టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలింస్, కిచ్చా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సెంథిల్, త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను, భారీ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు విజయ్ కార్తికేయా రూపొందిస్తున్నారు. రాబోయే క్రిస్మస్ పండగకు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తాజాగా వచ్చిన టైటిల్ గ్లింప్స్‌లో మేకర్స్ ప్రకటించారు.

Also Read- Star Heroine: నానితో రొమాన్స్.. పెద్ద టార్చర్.. ఇంకోసారి అతనితో ఆ బెడ్ రూమ్స్ సీన్స్ చేయను?

టైటిల్ గ్లింప్స్ ఎలా ఉందంటే..

‘మార్క్’ టైటిల్ గ్లింప్స్ (Mark – Title Glimpse) విషయానికి వస్తే.. ఒకే ఒక్క సన్నివేశంతో వచ్చిన ఈ టైటిల్ గ్లింప్స్ పవర్ ఫుల్‌గా ఉండటమే కాకుండా సినిమా, హీరో రేంజ్‌ని తెలియజేస్తుంది. మాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అనేలా గ్లింప్స్ అదిరిపోయింది. ముఖ్యంగా హీరో పాత్రను పరిచయం చేస్తూ.. ‘మ్యాడ్, యాటిట్యూడ్, రూత్ లెస్, కింగ్’.. అంటూ ‘మార్క్’ పేరులోని అక్షరాలకు నిర్వచనం చెప్పిన తీరు, విలన్స్, హీరో లుక్ అన్నీ కూడా టైటిల్ గ్లింప్స్‌ స్థాయిని పెంచేశాయి. అజయ్ మార్కండేయ పాత్రలో కిచ్చా సుదీప్‌ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఆ క్యారెక్టర్ పేరుతోనే సినిమా టైటిల్‌ను ‘మార్క్’ అని సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ గ్లింప్స్‌కు అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హై రేంజ్‌లో ఉంది. ఈ గ్లింప్స్‌‌కు తనిచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పుకోవాలి. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో కిచ్చా మరోసారి తన ‘మార్క్’ని ప్రదర్శించబోతున్నాడనేది ఈ గ్లింప్స్ తెలియజేస్తుంది. విక్రాంత్, నవీన్ చంద్ర, దీప్షిక, రోహిణీ ప్రకాష్ వంటి వారు ఇందులో ఇతర పాత్రలలో కనిపించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?