Ileana: చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇలియానా (Ileana D’Cruz) ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన ఇలియానా.. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఇద్దరు బిడ్డల బాగోగులను చూసుకునే క్రమంలో నటనకు దూరంగా ఉన్న ఇలియానా.. మళ్లీ నటిస్తానని ఈ వేడుకలో ప్రకటించారు. కాకపోతే ఓ కండీషన్ పెట్టారు. అదేంటంటే..
తెలుగులో స్టార్ హీరోయిన్
టాలీవుడ్‌కు రామ్ (Ram Pothineni) సరసన నటించిన ‘దేవదాసు’ చిత్రంతో పరిచయమైన ఇలియానా, ఆ తర్వాత టాలీవుడ్‌లోని అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి, నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. కొన్నాళ్ల పాటు టాప్ హీరోయిన్ ఛైర్‌పై కూర్చున్న ఇలియానా, సడెన్‌గా టాలీవుడ్‌కు టాటా చెప్పేసి, బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. వెళుతూ వెళుతూ టాలీవుడ్‌పై రెండు రాళ్లు కూడా వేసి వెళ్లిందనుకోండి. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, మళ్లీ రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో.. మళ్లీ టాలీవుడ్ వైపు ఆమె చూడలేదు. మధ్యలో రెండు మూడు సార్లు, సీనియర్ హీరోల సరసన ఆమె నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ, ఆమె నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు.
Also Read- OTT Crime Thriller: ఓటీటీలోకి రాబోతున్న థ్రిల్లర్ మూవీ.. వరుస హత్యలు చేసిందెవరు?
ప్రేమ, పెళ్లితో కన్ఫ్యూజ్ చేసింది
టాలీవుడ్ వదలి బాలీవుడ్ వెళ్లిన ఆమెకు అక్కడ కూడా ఘన స్వాగతమే లభించింది. బాలీవుడ్‌లోనూ ఆమె మంచి మంచి సినిమాలనే చేసింది. సక్సెస్ కూడా అందుకుంది. కానీ మధ్యలో ప్రేమాయణం పేరుతో ఆమె పేరు బాగా వైరల్ అయింది. ప్రియుడు ఎవరో చెప్పకుండానే ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. ఆ తర్వాత ఎప్పటికో తన భర్తని పరిచయం చేసింది. ఇలా తన ప్రేమ, పెళ్లి విషయాలలో జనాలందరినీ కన్ఫ్యూజ్ చేసిన ఇలియానా, ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లిగా మాతృత్వాన్ని అనుభవిస్తోంది.
Also Read- Sanjay Leela Bhansali: ప్రముఖ దర్శకుడు చేసిన పనికి నమోదైన కేసు.. మరీ ఎందుకిలా ఉంటారు?
అప్పుడు మాత్రమే మళ్లీ నటిస్తా..
తాజాగా ఆమె తన రీఎంట్రీ గురించి మాట్లాడారు. ‘‘నేను ఏ పని చేసినా, దానికి పూర్తిగా న్యాయం చేయాలని భావిస్తాను. అందుకే మళ్లీ నటనవైపు రావడానికి తొందరపడటం లేదు. కానీ, కచ్చితంగా మళ్లీ నటిస్తాను. ప్రస్తుతం అదే మిస్ అవుతున్నాను. కాకపోతే నా ఇద్దరి బిడ్డల సంరక్షణ చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రజంట్ వారికే నా ప్రాధాన్యం. నాకు తెలుసు, నా అభిమానులు నన్ను మిస్ అవుతున్నారని. నాకు కూడా అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేయాలని ఉంది. అందుకే కొంత గ్యాప్ తర్వాత మళ్లీ వస్తాను. రీ ఎంట్రీ ఎప్పుడనేది ఇప్పుడప్పుడే చెప్పలేను. కానీ, రీ ఎంట్రీ ఇస్తే మాత్రం శారీరకంగా కూడా నన్ను నేను రెడీ చేసుకునే వస్తాను..’’ అని ఇలియానా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై అభిమానులు ‘వెయిటింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు