MLA Palvai Harish Babu: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని బీజేపీ(BJP) ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు(MLA Palvai Harish Babu) సీబీఐ(CBI)కి విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పంపకాల విభేదాలే కుటుంబ లుకలుకలకు దారి తీశాయన్నారు. కవిత దగ్గర ఉన్న సమాచారాన్ని సీబీఐ తో పంచుకోవాలన్నారు. హరీష్ రావు(harish rao), సంతోష్ రావు(Santhosh Rao), మెగా కృష్ణ రెడ్డిల వల్లే కేసీఆర్(KCR) కు అవినీతి మరకలు అంటాయని కవిత స్పష్టంగా చెబుతుందన్నారు. కవిత(kavitha) సీబీఐనీ ఆశ్రయిస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.
ఆరోగ్యశ్రీ సేవలు
ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి అల్టిమేటం చేశాయన్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిల వల్ల రోగులకు వైద్యం ఇవ్వలేమని ప్రైవేట్ ఆస్పత్రులు(Private Hospitals) చెప్పేశాయన్నారు. ఆస్పత్రులన్నీ ఆరోగ్య సేవలు నిలిపివేశాయన్నారు. ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం రోగుల జీవితాలతో ఆడుకుంటుందని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లడానికి సీఎం తో నిధులున్నాయి.. కానీ ఆరోగ్య శ్రీకి నిధులు చెల్లించడానికి నిధులు లేవా? అని ప్రశ్నించారు.
Also Read: DK Aruna: గద్వాలపై ఎంపీ డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు
కనీసం మందులు లేవు
ఆరోగ్య శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) మానస పుత్రిక అని, ఆరోగ్య శ్రీ 5 లక్షల లిమిట్ ను 10 లక్షలకు పెంచుతున్నామని ప్రకటించారని, అది కాగితాలకే పరిమితమైందన్నారు. జర్నలిస్ట్ లు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ దిక్కు లేకుండా పోయిందని, వెల్నెస్ సెంటర్లలో కనీసం మందులు లేవు అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ఛానల్, రెడ్ చానల్ వ్యవస్థ ధ్వంసం అయ్యేంత వరకు రాష్ట్రం బాగుపడదన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఉన్న 13 వందల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Also Read: Hanuman Lord: హనుమాన్ కిందకి దిగి వచ్చాడు.. ఇదిగో ప్రూఫ్.. దేవుడని మొక్కి పూజలు మొదలు పెట్టండి ఇక?