CM Revanth Reddy (imagecredit:swetcha)
తెలంగాణ

CM Revanth Reddy: ఆయనకు ప్రత్యామ్నాయం ఎవరు లేరు.. నాటి కృషే నేటి ఫలితం

CM Revanth Reddy: వైఎస్, కేవీపీలకు ప్రత్యామ్నాయం ఎవరూ లేరని, చరిత్రలో ఒకే వైఎస్, ఒకే కేవీపీ ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వివరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డు ల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..సమకాలీన రాజకీయాల్లో అధికారం ఉన్నపుడు మిత్రులు గా వస్తారని, పవర్ పోయాక మాయం అవుతారని వెల్లడించారు. కానీ చదువుకునే రోజుల నుంచి మరణం వరకు వైఎస్ కి కేవీపీ రామచంద్ర రావు తోడు, నీడగా నిలబడ్డారన్నారు. కేవీపీ రామచంద్ర రావు లాగా ఉంటానని కొంతమంది తన దగ్గరకి వస్తున్నారని, కానీ తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేనన్నారు. చరిత్రలో, ఈ తరానికి ఈ తరానికి ఒకే వైఎస్,ఒకే కేవీపీ ఉంటారని నొక్కి చెప్పారు. తప్పులను తన ఖాతాలో,మంచిని వైఎస్ ఖాతాలో కేవీపీ వేసే వారని వెల్లడించారు.

ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం

సర్వం త్యాగం చేయగల గుణం,సమస్యలను ఎదురుకునే శక్తి కేవీపీ కి ఉన్నదన్నారు. ఇక రైతుల కోసం,వ్యవసాయం దండగ కాదు పండుగ అని చెప్పడానికి వైఎస్ పని చేశారన్నారు. దేశం లో ఏ రాష్ట్రం లో ప్రభుత్వాలు ఏర్పాటైనా.. ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా వైఎస్ ప్రభావితం చేశారన్నారు. ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేయడం తో పాటు రైతుల విద్యుత్ బకాయి లను,వారి పైన పెట్టిన కేసు లను వైఎస్ రద్దు చేశారన్నారు. రూ.2 రూపాయల కు కిలో బియ్యాన్ని రూపాయి కే ఇచ్చారన్నారు. ఉచిత కరెంట్ అంటేనే వైఎస్ పేరు గుర్తుకు వస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్,ఆరోగ్య శ్రీ వంటి పథకాలను ఎవరు అధికారం లోకి వచ్చినా కొనసాగించాల్సి వస్తుందన్నారు.

Also Read: BJP Bike Rally: ఆ జిల్లాలో కృష్ణమ్మ ప్రవహిస్తున్న.. నీటి నిల్వలు ఆర కోరే!

వరి వేస్తే ఊరే అని గత సీఎం

తెలంగాణ లో 3.10 కోట్ల మందికి ఉచితం గా సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. ఇందులో వైఎస్ స్ఫూర్తి ఉన్నదన్నారు. అధికారం లోకి వచ్చిన 3 నెలలోనే 2 లక్షల రైతు రుణ మాఫీ చేశామన్నారు. 25,35,694 మంది రైతులకు 20,617 కోట్ల రుణ మాఫీ చేసి రుణ విముక్తి కల్పించామన్నారు. వరి వేస్తే ఊరే అని గత సీఎం అంటే తాము వరి వేస్తే రూ. 500 రూపాయల బోనస్ ఇచ్చామన్నారు.,చివరి గింజ వరకు కొన్నామన్నారు. రాష్ట్రం లో ప్రకృతి వ్యవసాయంకోసం ప్రణాళికలు తయారు చేస్తామన్నారు.తెలంగాణ లో కరవు,వలసలను నివారించడం కోసం గోదావరి జలాలను తీసుకు రావడానికి వైఎస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను చేపట్టారని, నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం ఎస్ ఎల్ బీ సీ ని వైఎస్ చేపట్టారన్నారు. 30 కిలో మీటర్ల సొరంగం తవ్విన తర్వాత పనులు ఆపేశారన్నారు. ఎస్ ఎల్ బీ సీ ని తమ ప్రభుత్వం పూర్తి చేసి రైతుల కలను నెరవేరుస్తుందన్నారు.

మొదటి సారి ఎంఎల్ఏ

తన జీవిత ఆశయం రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమేనని వైఎస్ గతం లో ప్రకటించారని, తాను, వైఎస్ షర్మిల రాహుల్(YS Sharmila Rahul) ను ప్రధానిని చేసే వరకు అవిశ్రాంతంగా పనిచేస్తామన్నారు. వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ప్రతిపక్ష ఎం ఎల్ ఏ గా అసెంబ్లీ లో బడ్జెట్ పైన ప్రభుత్వాన్ని నిలదీశానని, మొదటి సారి ఎం ఎల్ ఏ అయినప్పటికీ తన విమర్శలకు వైఎస్ సభ లో సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. కోపం అనే నరం తెగిపోయిందని వైఎస్ చెప్పగా, ఆశ్చర్యానికి గురైనట్లు సీఎం వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారం లేకుండా ఆలోచనలతో ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హర్యాన మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల,మంత్రి శ్రీధర్ బాబు, మాజీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, మాజీ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి.రఘవీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: BRS Leaders Protest: మేడ్చల్లో జాతీయ రహదారి పై బీఆర్ఎస్ నాయకులు ధర్నా..?

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం