Local Body Elections (imagecredit:twitter)
తెలంగాణ

Local Body Elections: పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రచురణ.. వార్డుల వారీగా లెక్కలు

Local Body Elections: స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే గ్రామపంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఏడాది జూలై 1న అందుబాటులోకి వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను తూచ తప్పకుండా అనుసరిస్తూ వార్డుల విభజన చేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ను అనుసరించాలని స్పష్టం చేసింది. ఆగస్టు 28 నుంచి 30వ తేదీవరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించారు. వాటిపై ఆగస్టు 31న డీపీఓలు అభ్యంతరాలకు పరిష్కారం చూపారు. ఈ నెల 2న (మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను డీ(DPO)పీఓల ఆదేశాల మేరకు పంచాయతీకార్యదర్శులు ప్రచురించారు. పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్యాలేట్ బాక్సులు, ఇంకు బాటిల్లను సిద్ధం చేసింది.

షెడ్యూల్ ప్రకారం

ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ(ZPTC) ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీ(MPTC) లు, జడ్పీటీసీ(ZPTC) ల ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ/జడ్పీటీసీ ల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 9న ప్రదర్శించాలని అధికారులకు సూచించింది. ఎంపీటీసీ లు, జడ్పీటీసీ లకు ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఎంపీడీఓ(MPDO), ఏ డిఈ ఏ ఎస్(ADEAS) ద్వారా పోలింగ్ స్టేషన్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని సూచించింది.

Also Read: CM Revanth Reddy: సీఎం సంచలన నిర్ణయం.. ఇకపై స్కూళ్లు, కాలేజీల్లో అది తప్పనిసరి!

పదో తేదీన ప్రచురించాలని

జిల్లా ఎన్నికల అధికారులు జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో,మండల స్థాయిలో ఎంపీడీఓ లు మరియు ఏ డి ఈ ఏ ఎస్ ద్వారా ఈ నెల 8న సమావేశం నిర్వహించాలని పేర్కొంది. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు స్వీకరించాలని సూచించింది. ఏమైనా అభ్యంతరాలు, సూచనల ఉంటే 9న చేపట్టాలని పేర్కొంది. జిల్లా ఎన్నికల అధికారులచే పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను పదో తేదీన ప్రచురించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రంలోని అందరు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలు తప్ప). అన్ని అదనపు కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Ponnam Prabhakar: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పక్కా.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ