KTR: బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి పగ్గాలు కేటీఆర్(KTR) కే దక్కుతాయనే ప్రచారం పార్టీలో ఊపందుకుంది. ఇప్పటివరకు కేసీఆర్(KCR) తర్వాత ఎవరు నాయకత్వం వహిస్తారనేది పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ సందేహం నెలకొంది. ఇటు సొంతపార్టీ నేతలతో పాటు ఇతర పార్టీలోని లీడర్లలో సైతం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉండేది. కానీ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన వ్యాఖ్యల దూమారం బీఆర్ఎస్ పార్టీని ముఖ చిత్రాన్ని మార్చేసింది. గులాబీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్(KTR), హరీష్(Harish Rao) , కవితలు(Kavitha) ఆప్షన్ గా ఉండేవాళ్లు.
రాజకీయంగా డ్యామేజ్
కవిత గత కొంతకాలంగా చేస్తున్న విమర్శలు ఆమె సస్పెండ్ కు తెరదీయగా, తాజాగా హరీష్ రావు(Harish Rao), సంతోష్ రావు(Santhosh Rao)లపై కవిత చేసిన అవినీతి ఆరోపణలు ఇద్దరు నేతలను రాజకీయంగా డ్యామేజ్ చేసినట్లు అయింది. భవిష్యత్ లో ఎంక్వాయిరీలు జరిగితే ఈ ఇద్దరు నేతలు చట్టపరంగా విచారణను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ గులాబీ బాస్ గా మారే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారితీసింది.
Also Read: CM Revanth: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై అందరికీ..?
యజమాని కేటీఆర్ మాత్రమే
ఇదే అంశంపై ‘కల్వకుంట్ల కుటుంబ రాజకీయ ఆటలో కవిత ఔట్.. ఎవరు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) తదుపరి యజమాని కేటీఆర్ మాత్రమే.. భవిష్యత్తులో హరీష్ రావు, సంతోష్ రావు లను అవినీతి అనకొండలుగా ముద్రించి బయటికి పంపే అస్త్రంగా కవిత.. తర్వాత అన్నతో కలిసి రాజకీయం చేసే ఎత్తుగడ స్పష్టం.. ఏం చెయ్యాలో తెలియక టపాసులు కాలుస్తున్న పింక్ గొర్రెలు..’ అని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రాంమ్మోహన్ రెడ్డి(Samaram Mohan Reddy) చేసిన ట్విట్ ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.
Also Read: Viral Video: ఒరేయ్ బుడ్డోడా.. ఎంత పని చేశావ్‌రా.. నీ దెబ్బకు అంతా వణికిపోయారు!