JubileeHills-by-Election
తెలంగాణ, హైదరాబాద్

JubileeHills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కీలక అప్‌డేట్

Jubilee Hills Bypoll: నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,92,669

మొత్తం పోలింగ్ స్టేషన్లు 407
ఓటరు జాబితా ముసాయిదా ప్రచురణ
ఈ నెల 17 వరకు అభ్యంతరాల స్వీకరణ
మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం
25 వరకు ఫిర్యాదులు, ఆర్జీల పరిష్కారం
30న ఓటర్ల తుది జాబితా విడుదల

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ (Jubilee Hills Bypoll) ఓటరు ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రచురించింది. జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల 92 వేల 669 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 2 లక్షల4 వేల 288 మంది ఉంది. మహిళా ఓటర్ల సంఖ్య లక్షా 88 వేల 356 మంది ఉంది. ఇక, ట్రాన్స్ జెండర్లు 25 మంది ఓటర్లుగా ఉన్నట్లు ఎన్నికల సంఘం జాబితాలో పేర్కొంది. ఈ మొత్తం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నియోజకవర్గంలోని దాదాపు 139 ప్రభుత్వ, ప్రభుత్వేతర భవనాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొంది. ఓటరు జాబితా ముసాయిదాపై రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థల నుంచి ఈ నెల 2 వ తేదీ మంగళవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. స్వీకరించిన అభ్యంతరాలను ఈ నెల 25లోగా పరిష్కరించి, 30వ తేదీన ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Read Also- Dondigal Lake Accident: గణేష్ నిమజ్జనోత్సవంలో విషాదం.. ఆటో చెరువులో పడి తండ్రి, కొడుకు?

అంతలోపు నియోజకవర్గం పరిధిలో 18 ఏళ్లు దాటిన యువతకు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశంతో పాటు ప్రస్తుతం ఓటరు జాబితా ముసాయిదాలోని ఓటరు సంబంధిత సమాచారంలో మార్పులు, చేర్పులు చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ www.voters.eci.gov.in లేదా www.ecotelengana.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఓటరు జాబితాలో ఓటర్లు తమ వివరాలను సరి చూసుకోవాలని, అవసరమైన వారు సవరించుకోవాలని కూడా సూచించింది. లేక, జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహారిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సవరణ ఫారాల కోసం సంప్రదించవచ్చునని కూడా ఎన్నికల సంఘం సూచించింది.

Read Also- Online Betting Scam: ఆన్​ లైన్​ బెట్టింగ్ నిర్వాహకులకే టోకరా.. రూ.30లక్షల రూపాయలమోసం?

వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్?
ఈ నెలాఖరున జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన కొత్త ఓటరు జాబితాను సిద్దం చేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. వచ్చే నెల మొదటి వారంలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయవచ్చని తెలిసింది. వచ్చే నెల, మూడు లేక నాలుగో వారంలో పోలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు కొద్ది నెలలుగా ఆ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ది పనులపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?