MLC Kavitha
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

MLC Kavitha: కీలక నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత?.. ప్రకటన ఎప్పుడంటే?

MLC Kavitha: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా దిశగా అడుగులు?

బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం..

బుధవారం ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే ఛాన్స్
ఇక రాజకీయ స్పీడ్ పెంచే అవకాశం
ఆమె టార్గెట్ ఎవరనేదానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నాయకత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో, కేసీఆర్ కూతురు కవిత సైతం (MLC Kavitha) పార్టీకి ఝులక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. బుధవారం ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు కవిత అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆమె నివాసంలోనే బుధవారం మధ్యాహ్న సమయంలో మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీగా మాట్లాడారని అంటున్నారు. బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో మనోవేదనకు గురై ఆమె ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అనుచరులు పేర్కొన్నారు.

కాగా, కవిత 2006 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమ స్పూర్తితో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి తనవంతు పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత పోరాటంలో మహిళలు, యువత, సమాజంలోని మరికొన్ని వర్గాల మద్దతును సమీకరించడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది. 2009 నుంచి 2014 వరకు జాగృతి తరపున కవిత యాక్టివ్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీలో సుమారు 19 ఏళ్లపాటు కొనసాగారు.

తండ్రి బాటలోనే కవిత..
తన తండ్రి కేసీఆర్ బాటలోనే జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పయనించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేసీఆర్ తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా టీఆర్ఎస్‌ను 2001 ఏప్రిల్ 27న ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే కవిత ‘నాది కేసీఆర్ బ్లడ్.. నేను ఇండిపెండెంట్‌గా ఉంటాను’ అని మీడియా వేదికగా స్పష్టం చేశారు. కేసీఆర్ నిర్ణయం తీసుకున్న రీతిలోనే ఇప్పుడు కవిత సైతం అదే నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ జాగృతి పేరుపై పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ప్రచారం సైతం ఊపందుకుంది. మరోవైపు, బీఆర్ఎస్ (బహుజన రాష్ట్రసమితి) పేరును సైతం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీ ప్రకటనకు కొంత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కవితకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ, గుర్తింపు ఉంది. జాగృతి సంస్థతో ఉద్యమసమయంలో చేపట్టిన బతుకమ్మ ఉత్సవాలు, నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టి ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే ప్రజాదరణ పొందేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Read Also- SSMB29 Kenya Shoot: ఆ క్రేజ్ ఏంటి భయ్యా.. ఖండాలు దాటిపోయింది.. నువ్వు దేవుడివి సామీ

ఇకపై పెరగనున్న రాజకీయ స్పీడ్
కవిత ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. దీంతో కొన్నివిషయాలు పార్టీ నిర్ణయాలకు లోబడి కవిత మాట్లాడారని, ఇప్పుడు సస్పెండ్ చేయడంతో ఆమెకు ఎలాంటి పరిమితులు లేవని, ఏదైనా ముక్కుసూటిగా చెప్పవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలను సైతం ఎత్తిచూపబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామస్థాయిలో తాను ఉద్యమంలో పాల్గొన్న తీరు, రాష్ట్ర ఏర్పాటులో తనవంతు పాత్ర వివరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమం, మరోవైపు ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను సైతం చేపట్టబోతున్నట్లు సమాచారం. ప్రజల్లోకి వెళ్లి మరింతగా వ్యక్తిగతంగా పటిష్టం కావాలని వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Read Also- Online Betting Scam: ఆన్​ లైన్​ బెట్టింగ్ నిర్వాహకులకే టోకరా.. రూ.30లక్షల రూపాయలమోసం?

టార్గెట్ ఎవరనేది కూడా చర్చ
కవిత ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీరును ఎండగట్టారు. కేసీఆర్‌పై కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులు, విచారణకు పిలువడంపై తీవ్రస్థాయిలో స్పందించారు. కేటీఆర్ స్పందించక పోవడాన్ని ఎండగట్టారు. అదే విధంగా హరీష్ రావు, సంతోష్, జగదీష్ రెడ్డిలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇవ్వడంను తీవ్రంగా పరిగణించిన కవిత.. కేసీఆర్‌పై అవినీతి మరక అంటించడంలో హరీష్ రావు, సంతోష్ కారణమని, వారిపై విచారణ చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో నెక్ట్స్ కవిత టార్గెట్ ఎవరు?, ఎవరిపై బాణం ఎక్కుపెట్టనున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలను ఎండగట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు కవిత దూకుడుతో గులాబీ పార్టీకి మరింత నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!