OG Glimpse: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓజీ సినిమా నుంచి గ్లింప్స్ వదిలారు నిర్మాతలు. ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) పవన్ కళ్యాణ్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రం. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో తనదైన శైలితో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నారు. స్టైలిష్ విజువల్స్, థమన్ పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ చిత్రం అభిమానుల అంచనాలను మించనుంది. ఇమ్రాన్ హష్మీ తెలుగు సినిమాలో తొలిసారి విలన్‌గా కనిపించడం హిందీ, తెలుగు ప్రేక్షకులను ఆకర్షించనుంది. సుజిత్ స్టైలిష్ టేకింగ్‌తో ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Read also- Dwayne Johnson: కండల వీరుడికి కన్నీళ్లు.. అక్కడ ఏం జరిగిందంటే..?
నిర్మాతలు విడుదల చేసిన గ్లింప్స్ (OG Glimpse)చూస్తుంటే.. ‘డియర్ ‘ఓజీ’ నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురుచూస్తున్నా.. నీ ఓమీ.. హ్యాపీ బర్త్ డే ఓజీ ’ అంటూ ఇమ్రాన్ హష్మీ వాయిత్ తో మొదలవుతుంది ఈ గ్లింప్స్. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ లుక్ లో తన వీరత్వం చూపించారు. థమన్ సంగీతం వేరే లెవెల్ లో ఉంది. మాస్ బీజీఎమ్ ప్యాన్స్ కు పిచ్చెక్కించే విధంగా సంగీతాన్ని సమకూర్చారు థమన్. దర్శకుడు సుజిత్ ఈ సినిమాను చాలా శ్రద్ధగా నిర్మించారని తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ లోనూ తనదైన శైలిలో పవన్ ఫ్యాన్ స్క్రీన్ పై ఎలా చూడలనుకుంటున్నారో అలాగే చూపించారు. విలన్ గా ఇమ్రాన్ హష్మీ ఆ పాత్రకి సరిపడా వెయిట్ అందించారని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఈ సినిమాకోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని బారీ అంచనాలు పెట్టుకున్నారు.
Read also-Uttar Pradesh: బాలికను వెంటాడుతున్న పాము.. 40 రోజుల్లో 9 సార్లు కాటు.. అంతుచిక్కని మిస్టరీ!
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే సినిమా పవర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఫైర్ స్టోమ్ పాట్ అయితే చెప్పనక్కర్లేదు ప్రపంచ యూట్యూబ్ నే షేక్ చేసింది. యూట్యూబ్ లో గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది. థమన్ స్వరపరిచిన లిరిక్స్ ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటుకున్నాయి. ఆ తర్వాత విడుదలైన ‘సువ్వి సువ్వి’ అదే స్టాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ గ్లింప్ ప్యాన్స్ కు పూనకాలు వచ్చే విధంగా ఉంది. ఏది ఏమైనా ఈ సినిమాతో తెలుగు సినిమా రికార్డుల పవన్ కళ్యాణ్ తిరగ రాస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.