TG MBBS Admissions: రాష్ట్రంలో ఎంబీబీఎస్(MBBS) అడ్మిషన్లకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానికత కోసం గతంలో తీసుకువచ్చిన జీవో 33ని సుప్రీం కోర్టు సమర్ధించింది.9 నుంచి ఇండర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వరుసగా 4 ఏళ్లు చదవాల్సిందేననే రూల్ సరైందంటూ అంటూ సుప్రీం కోర్టు మద్ధతు ఇచ్చింది. స్థానికత నిబంధనలు సరియైనవేనని అభిప్రాయపడ్డ అత్యున్నత న్యాయస్థానం, హై(High Cort)కోర్టు ఉత్తర్వులు రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో తెలంగాణ విద్యార్థులకే ఎంబీబీఎస్ సీట్లు దక్కనుండగా, సుప్రీంకోర్టు నిబంధనలతో ఆంధ్ర ప్రాంత విద్యార్థులు, స్థానికేతరులకు చుక్కెదురైంది. వంద శాతం సీట్లు స్థానికులకే దక్కేలా రాష్ట్ర సర్కార్ తీసుకున్న చర్యలకు సుప్రీంకోర్టు మద్దతు ఇవ్వడం గమనార్హం.
జీవో 33 పాటించాల్సిందే..
ఇంటర్మీడియట్ బయట రాష్ట్రాల్లో చదివిన తెలంగాణ(Telangana) స్థానికులు.. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు అనర్హులని జీవో 33 స్పష్టం చేస్తుంది. దీంతో కొందరు విద్యార్ధులు కోర్టు ను ఆశ్రయించారు. విచారణ తర్వాత స్థానికులై, ఇంటర్ బయట చదివినా, ఎంబీబీఎస్ కు అవకాశం ఇవ్వాలని హైకోర్టు కాళోజీ వర్సిటీకి ఆదేశాలిచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, జీవో 33కి మద్ధతుగా సుప్రీం నిలిచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ బదిలీల కారణంగా ఇతర రాష్ట్రాల్లో పనిచేసిన వారి పిల్లలు, ఆల్ ఇండియా సర్వీస్ తెలంగాణ కేడర్(All India Service Telangana Cadre) అధికారుల పిల్లలు, రక్షణ, పారామిలటరీ ఉద్యోగుల పిల్లలంతా తెలంగాణ అభ్యర్ధులుగానే పరిగణించబడతారని సుప్రీం సూచించింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయిలో ప్రూప్స్ తప్పనిసరిగా అని పేర్కొన్నది. ఈ అంశంపై వర్సిటీ అధ్యయనం చేసి జీవో 33 ను సవరణ చేసే అవకాశం న్నది.
Also Read: Nagarkurnool: యూరియా రేటు పెంచి అమ్మితే చర్యలు.. నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే, కలెక్టర్ హెచ్చరిక
కౌన్సిలింగ్ ఇప్పటికే ఆలస్యం..
షెడ్యూల్ ప్రకారం జూలై చివరి వారంలోనే కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నది. కానీ కోర్టు కేసులు, ఆల్ ఇండియా ప్రవేశాల ప్రక్రియ జాప్యంతో ప్రాసెస్ లేట్ అయింది. ఇప్పటికే కన్వీనర్, యాజమాన్య, ఎన్ ఆర్ ఐ కేటగిరీ అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. సుప్రీం కోర్టు తీర్పుతో మళ్లీ అడ్మిషన్ల ప్రాసెస్ మొదలు కానున్నది. సెప్టెంబరు 10 లోగా అడ్మిషన్ల ప్రాసెస్ పూర్తి చేయాలని వర్సిటీ ప్లాన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలో 8515 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, సర్కారీ కళాశాల్లో 4090 సీట్లు ఉన్నాయి. వీటిలో ఆలిండియా కోటా కింద 613 సీట్లు వెళ్తాయి. మరోవైపు సెప్టెంబరు 4 నుంచి 12 మధ్య ఆల్ ఇండియా కోటా రెండో విడత ప్రవేశాల కౌన్సిలింగ్ జరగనున్నది. అక్టోబరు 25 వరకు రిపోర్టింగ్ కు టైమ్ ఇవ్వనున్నారు.
Also Read: Land Dispute: ఘోరానికి దారితీసిన 11 గుంటల భూవివాదం