Kaleshwaram project – CBI: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకాలను విచారించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ(BJP), బీఆర్ ఎస్(BRS) లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఘోష్ కమిషన్(Ghosh Commission) ఇచ్చిన రిపోర్టుపై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత సీఎం అందరికీ షాక్ ఇచ్చారు. సీబీఐకి అప్పగిస్తున్నామని సీఎం చేసిన ప్రకటనతో ఆ రెండు పార్టీల్లోనూ ఒక్క సారి ఆందోళన నెలకొన్నది. అప్పటి వరకు సిట్, సీఐడీ(CID) ఎంక్వైయిరీలు వేస్తారని భావించిన ఆ రెండు పార్టీల నేతలకు కాంగ్రెస్(Congress) ఇచ్చిన షాక్.. అందరిలోనూ ఆశ్చర్యానికి తెర లేపింది. ఈ నిర్ణయం వెనక సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేకమైన వ్యూహం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. రెండు పార్టీలను ఇరకాటంలో పెట్టేందుకు ఇంత కంటే మరో ఆప్షన్ లేదని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు చర్యల బాల్ ను కేంద్రం కోర్టులోకి నెట్టి కాంగ్రెస్(Congress) స్పష్టంగా స్కిప్ అయింది. దీని వలన కాంగ్రెస్ కు మరింత పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఎక్స్ పర్ట్స్ కూడా చెబుతున్నారు.
రెండు పార్టీల మధ్య పొత్తుపై స్ట్రాంగ్ ప్రూఫ్..?
బీజేపీ(BJP), బీఆర్ ఎస్(BRS) ఇంటర్నల్ గా పొత్తు పెట్టుకున్నాయని మొదట్నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తూనే ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి డైవర్షన్ అయిందంటూ సీఎంతో సహా మంత్రులంతా విమర్శించారు. ఈ రెండు పార్టీలు స్పష్టమైన ఒప్పందాలతో పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నిత్యం విమర్శలు చేస్తునే ఉన్నది. రాబోయే రోజుల్లోనూ పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉన్నదనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే క్రమంలో కాళేశ్వరం కేసును కాంగ్రెస్ కేంద్రానికి ఇవ్వడం చర్చంశనీయంగా మారింది. కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకోకపోతే బీజేపీ బద్నాం అయ్యే ఛాన్స్ ఉన్నది. బంతి బీజేపీ కోర్టులో ఉన్నదని, చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకాడుతున్నారని కాంగ్రెస్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండు పార్టీలు ఒకటేనని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ తర్వాత సీబీఐ చర్యలు తీసుకుంటే, ప్రాజెక్టు అనుమతులు, నిర్మాణం, ఇతర టెక్నికల్ అంశాలకు క్లియరెన్స్ ఎందుకు ఇచ్చారంటూ కాంగ్రెస్ రివర్స్ గేర్ వేసి బీజేపీని నిలదీసే ఛాన్స్ ఉన్నది. ఇలా ఆ రెండు పార్టీలను ఇరకాటానికి గురి చేసి పొలిటికల్ లబ్ధి పొందాలని కాంగ్రెస్ స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది.
Also Read: Telangana Assembly: కేసీఆర్ అసెంబ్లీ వస్తారా?.. బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయంటే?
ప్రభుత్వం నుంచి ప్రత్యేక లేఖ…?
కాళేశ్వరం అవకతవకలపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై పుల్ మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉన్నది. తమకు చిత్తశుద్ధి ఉన్నదని, అందుకే సీబీఐ(CBI)కు అప్పగించినట్లు కాంగ్రెస్(Congress) ప్రచారం చేయనున్నది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపేందుకు సీబీఐకి ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు పదే పదే గతంలో ప్రచారం చేశారు. దీన్ని ప్రభుత్వం, పార్టీ క్లెయిమ్ చేసుకోనున్నది. బీజేపీ కోరినందుకే సీబీఐ వేశామని ప్రచారం చేయనున్నది. బీజేపీ ఏం చేస్తుందనే దానిపై కాంగ్రెస్ క్షుణ్ణంగా పరిశీలించనున్నది. అయితే గతంలో సీబీఐ రాష్ట్రానికి వచ్చి కేసులు విచారించే అధికారం లేకుండా కేసీఆర్(KCR) చట్టం చేశాడని ప్రభుత్వం చెబుతున్నది. ఇప్పుడు ప్రభుత్వమే సీబీఐకి లేఖ రాయనున్నది. ఈ కేసును విచారించేందుకు రాష్ట్రానికి రావాలని త్వరలోనే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి లేఖ రాయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేసుల వారిగా రాష్ట్రానికి వచ్చి విచారణ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాస్తుంది. ఇదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ విషయంలోనూ ప్రత్యేక లేఖ రాయనున్నారు.
Also Read: Mulugu District: పోరు కన్నా.. ఊరు మిన్న.. కార్యక్రమంతో సత్ఫలితాలు..?