MLA Palvai Harish Babu (imagecredit:swetcha)
Politics

MLA Palvai Harish Babu: కాళేశ్వరం సొమ్ము దేశాలు దాటింది.. విచారణ చేయాల్సిందే..!

MLA Palvai Harish Babu: పీసీ ఘోష్, ఎన్డీఎస్ఏ రిపోర్టులపై బీఆర్ఎస్ పిచ్చి వాగుడు వాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు(MLA Palvai Harish Babu) విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు సభలో చిల్లరగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేటీఆర్(KTR), హరీశ్ రావు(Harish Rao) తీరు ప్రజలు ఛీదరించుకునేలా ఉందన్నారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం విచారణను ఎదుర్కోవాలని హరీశ్ సవాల్ విసిరారు. కాళేశ్వరం అవినీతి సొమ్ము దేశాలు దాటిందని ఆయన ఆరోపించారు. వీటిపై పక్షపాతం లేకుండా విచారణ జరగాలంటే సీబీఐ(CBI) ఎంక్వైరీనే కరెక్ట్ అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే కాళేశ్వరం కేసును సీబీఐ విచారణకు అప్పగించి ఉంటే ఈపాటికి వాస్తవాలు బయటికి వచ్చేవని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సీబీఐ విచారణకు ఇచ్చినందుకు కాంగ్రెస్ కు హరీశ్ బాబు ధన్యవాదాలు తెలిపారు.

భయపడుతున్నారా..

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎవరు మాట్లాడినా.. వారు కాంగ్రెస్ నేతలు అయిపోతారా? అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎవరు మాట్లాడినా వారిపై బట్ట కాల్చి మీద వేయడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని విమర్శలు చేశారు. బీజేపీ-కాంగ్రెస్ కలిసి సీబీఐ విచారణకు ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల తీరు అత్త తిట్టిన బాధ కంటే తోటి కోడలు తిట్టిందనే బాధ ఎక్కువైంది అన్నట్టుగా పరిస్థితి మారిందని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించడంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అని బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని హరీష్ బాబు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy), కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి(Naveen Kumar Reddy) తాను అసెంబ్లీలో మాట్లాడిన విషయమై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. కాళేశ్వరం కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఈలు(EE), డీఈ(DE)లు రూ.వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని, అధికారుల వద్దనే ఇంత అక్రమ సొమ్ము ఉంటే అప్పటి సీఎం కేసీఆర్ వద్ద ఇంకెంత అక్రమ సొమ్ము ఉంటుందోనని ఆయన ఆరోపించారు.

Also Read: Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ అనూహ్య నిర్ణయం.. దీనికి కారణం ఏమిటి?

సభ నుంచి వాకౌట్ చేశాక

ఇదిలా ఉండగా తుమ్మిడిహట్టికి ఉప నదులు లేవని పాల్వాయి హరీశ్ బాబు తెలిపారు. గోదావరిలో నీళ్లు లేనందుకు ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణానానికి పూనుకున్నామన్నారు. మహారాష్ట్ర బాబ్రీ ప్రాజెక్ట్(Maharashtra Babri Project) నిర్మాణం అనంతరం గోదావరిలో నీటి సరఫరా తగ్గిందని పేర్కొన్నారు. స్థానిక శాసన సభ్యుడిగా తనకు తుమ్మిడిహట్టి పై అవగాహన ఉందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టకుండా కిందకు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించినందుకు బీఆర్‌‌ఎస్ కు బాధ అయినట్లుందన్నారు. తుమ్మిడిహట్టిపై అవకాశం ఇవ్వాలని తాను స్పీకర్ కు లెటర్ పెట్టుకున్నానని, తాము సభ నుంచి వాకౌట్ చేశాక.. మాట్లాడాలనుకుంటే సభలోకి రావాలని స్పీకర్ కార్యాలయం నుంచి తనకు మెసేజ్ వచ్చిందన్నారు. తమపై మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలన్నారు. బీఆర్ఎస్ పై వ్యతిరేక పోరాటం చేసే తాను ఇక్కడి వరకు వచ్చానని పాల్వాయి వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. బీఆర్ఎస్.. అసెంబ్లీలో చాలా చీప్ గా బిహేవ్ చేసిందని విమర్శలు చేశారు.

Also Read: Star Actress: క్యాన్సర్‌తో ప్రముఖ నటి కన్నుమూత.. విషాదంలో ఇండస్ట్రీ!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?