Bhudan Lands Scam (imagecredit:twiter)
తెలంగాణ

Bhudan Lands Scam: భూదాన్​ భూముల కేసులో దూకుడు పెంచిన ఈడీ.. ఇద్దరి ఆస్తులు జప్తు..?

Bhudan Lands Scam: భూదాన్​ భూముల అమ్మకాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోర్జరీ పత్రాలతో భూదాన్​ బోర్డుకు చెందిన భూములను విక్రయించిన ఇద్దరి ఆస్తులను ఎన్​ ఫోర్స్​ మెంట్ డైరెక్టర్​ (ED) అధికారులు జప్తు చేశారు. ఇది భూములు కొన్న ఐఏఎస్​(IAS), ఐపీఎస్​(IPS) అధికారులతోపాటు మరికొందరు ప్రముఖుల్లో కలవరాన్ని కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలో 181, 182 సర్వే నెంబర్లలో 103 ఎకరాల భూదాన్​ భూములు ఉన్నాయి. పాతబస్తీలో నివాసముంటున్న ఖదీర్​ ఉన్నీసా అనే మహిళ తండ్రి ఈ సర్వే నెంబర్లలో ఉన్న 50 ఎకరాల భూమిని కొన్నేళ్ల క్రితమే భూదాన్​ బోర్డుకు దానంగా రాసిచ్చారు.

భూమిని ప్లాట్లుగా మార్చి

అయితే, ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల రేట్లు ఊహించని విధంగా పెరిగి పోయాయి. ఎకరం భూమి ధర కోట్లలో పలుకుతోంది. దాంతో 2021లో ఖదీర్​ ఉన్నీసా ఆ భూమికి తానే వారసురాలినని పేర్కొంటూ తన పేర బదలాయించాలంటూ దరఖాస్తు చేసుకుంది. ఆ వెంటనే రెవెన్యూ అధికారులు కొందరు ఈ భూమిని ఖదీర్​ ఉన్నీసా పేరు మీద రిజిస్ట్రేషన్​ చేశారు. ఆ వెంటనే ఖదీర్​ ఉన్నీసా మరికొందరితో కలిసి భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించింది. వీటిని కొన్నవారిలో ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులతోపాటు కొందరు రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా ఉన్నారు. కాగా, భూదాన్​ భూములను అక్రమంగా అమ్ముకున్నారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా ముందుగా మహేశ్వరం పోలీసులు దీనిపై కేసులు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్​ ఆధారంగా ఈడీ అధికారులు కూడా భూదాన్ భూముల అమ్మకాలపై కేసులు రిజిష్టర్​ చేశారు.

Also Read: Wagah-Attari Border: పాక్ దౌర్భాగ్యం చూశారా.. ప్రకృతి కూడా ఆటపట్టిస్తోంది.. వైరల్ వీడియో

పాతబస్తీలోని ఖదీర్ ఉన్నీసా

భూదాన్​ భూములు ఖదీర్​ ఉన్నీసా పేరు మీద రిజిష్టర్ అయినపుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న అమోయ్ కుమార్​ కు నోటీసులు జారీ చేసి పలుమార్లు విచారించారు. కొందరు రెవెన్యూ అధికారులను కూడా ప్రశ్నించారు. అప్పటి ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు ఇచ్చి వారి నుంచి కూడా వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే పాతబస్తీలోని ఖదీర్ ఉన్నీసా నివాసంతోపాటు మునావర్​ ఖాన్​, సర్ఫాన్​ తదితరుల నివాసాల్లో తనిఖీలు జరిపారు. విచారణలో భూదాన్ భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే సోమవారం భూముల అమ్మకాల్లో కీలకంగా వ్యవహరించిన మునావర్​ ఖాన్, అతని భార్య ఫైకా తహఖాన్​ కు చెందిన బంజారాహిల్స్, శంషాబాద్​, టోలీచౌకీ ప్రాంతాల్లో ఉన్న 4.80కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేశారు.

Also Read: Suraksha Kavach: పోకిరీల ఆటలకు చెక్.. స్కూల్​ పిల్లల కోసం సురక్ష కవచ్..!

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?