Poonam on UBS
ఎంటర్‌టైన్మెంట్

Poonam Kaur: నిర్మాతలు ఆ పని చేయండి.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ ట్వీట్

Poonam Kaur: మరి అటెన్షన్ కోసం చేస్తుందో, లేదంటే కావాలనే టార్గెట్ చేస్తుందో తెలియదు కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని, ఆయన సినిమాలను, ఆయన దోస్తులను మాత్రమే టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ ఎప్పుడూ వార్తలలో నిలిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆమె చేసే ట్వీట్స్ ఎవరికీ అర్థం కూడా కావు. ఆమె టార్గెట్ టాలీవుడ్‌లోని ఓ దర్శకుడు అని ప్రస్తుతానికి జనాలు కూడా ఓ లెక్కకు వచ్చారు. మరి పవన్ కళ్యాణ్‌ని ఎందుకు ప్రతిసారి ఆమె సోషల్ మీడియాకు ఎక్కిస్తుందనేది మాత్రం ఆయన అభిమానులకు కూడా అర్థం కాని విషయం. రీసెంట్‌గా సుగాలి ప్రీతి కేసు విషయమై పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను, ఆ చిత్ర నిర్మాతలను ఇన్వాల్వ్ చేస్తూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్.. చర్చలకు దారి తీస్తోంది.

Also Read- Bunny Vas: టాలీవుడ్‌లో చాలా రూల్స్ ఉన్నాయ్.. కానీ పాటించడమే అసాధ్యం! బన్నీ వాస్ షాకింగ్ కామెంట్స్

ఇంతకీ ఆమె ట్వీట్‌లో ఏం చెప్పిందంటే.. ‘‘మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు.. మీరు పంజాబ్ స్ఫూర్తికి ప్రతీక అయిన భగత్ సింగ్ పేరు మీద ఒక సినిమా తీశారు. గత 40 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం పంజాబ్‌లో వరదలు సంభవించి తీవ్ర నష్టం జరిగింది. ఆ రాష్ట్రానికి మీరు సహాయం ప్రకటిస్తారని ఆశిస్తున్నాను. మీరు వ్యాపారం చేస్తున్న ఆ స్ఫూర్తికి (భగత్ సింగ్) అనుగుణంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను. జైహింద్!’’ అంటూ పూనమ్ తన ట్వీట్‌లో పేర్కొంది. గతంలో కూడా ఇదే సినిమా నిమిత్తం ఆమె చేసిన ట్వీట్‌పై పెద్ద రాద్ధాంతమే జరిగింది. టైటిల్‌ను కాళ్ల దగ్గర ఎలా పెడతారు? అంటూ ఆమె చిత్రయూనిట్‌ని క్వశ్చన్ చేసింది. వెంటనే వాళ్లు పేరు ఉన్న ప్లేస్‌ను మార్చారు.

Also Read- Lavanya Tripathi’s Movie: అథర్వ మురళి, లావణ్య త్రిపాఠిల గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఇక ఆమె ట్వీట్ చూసిన వారంతా ఒక్కటే అడుగుతున్నారు. కేవలం పవన్ కళ్యాణ్, ఆయన సినిమాలు మాత్రమే నీకు కనిపిస్తాయా? దేశంలో ఉన్న సమస్యలు, కాంట్రవర్సీ పర్సన్స్ ఎవరూ కనిపించడం లేదా? అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరి పూనమ్ చేసిన ట్వీట్‌కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రియాక్ట్ అవుతారో లేదో తెలియదు కానీ, మరీ ఆమె చేసిన ట్వీట్ మాత్రం చాలా హార్ష్‌గా ఉందని మాత్రం చెప్పొచ్చు. వాళ్ల స్ఫూర్తి మీద వ్యాపారం చేస్తున్నారని అనడంపై మాత్రం నిర్మాతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు.

గతంలో ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పేర్లతో సినిమా పేర్లు వచ్చాయి. అప్పుడు ఎవరూ ఇలా ప్రశ్నించలేదు. మరి ఎందుకు? ఇలా ఆమె తీరు ఉందనేది, ఆమెకే తెలియాలి. ఇలా దాగుడు మూతల తరహాలో ట్వీట్స్ వేయడం కాకుండా.. తనకి నిజంగా ఏదైనా అన్యాయం జరిగి ఉంటే, దానికి సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే ఫైట్ చేయాలి. ప్రతిసారి ఇలా ట్వీట్స్ వేస్తే ఏం లాభం అనే వారు లేకపోలేదు. చూద్దాం.. ఇంకా ఎంతకాలం ఆమె ఇలా ట్వీట్స్‌కే పరిమితం అవుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..

BRS Party: జూబ్లీహిల్స్ ప్రచార సరళిపై గులాబీ నిత్యం ఆరా.. సొంత నేతలపై నిఘా!

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?