Maoists
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Maoists: తెలంగాణలో మావోయిస్టుల సంచారం?

Maoists: ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కదలికలు?

తాడ్వాయి మండలంలో ఆదివాసీ సంఘం పేరిట వెలసిన పోస్టర్లు

ములుగు, స్వేచ్ఛ: మావోయిస్టులు (Maoists) మళ్లీ తెలంగాణలో సంచరిస్తున్నారా?, కార్యకలాపాలను మళ్లీ పునరావృతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా?, అంటే ఔననే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల సంచారం ఉన్నట్టుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని విశ్వసనీయ సమాచారాన్ని సైతం నిఘవర్గాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు  విస్తృతంగా గ్రామాల్లో వివరాలను సేకరించే పనిలో పడ్డట్టుగా సమాచారం.

కొన్ని జిల్లాల్లో ఈ విషయాలను జిల్లా ఎస్పీలకు సైతం చేరవేసినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ తర్వాత తెలంగాణ -చత్తీస్‌గఢ్రా ష్ట్రాల సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టల నుంచి వెళ్లిపోయిన మావోయిస్టులు ఆంధ్ర – ఒడిశా, ఆంధ్ర-చత్తీస్‌గఢ్‌లతో పాటు మరికొన్ని రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు చేరుకొని ఉంటారని అనుమానంగా ఉంది. అయితే, ఆయా రాష్ట్రాల పోలీస్ బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేస్తున్న నేపథ్యంలో తిరిగి దండకారణ్యం ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ, అబూజ్‌మడ్, సుక్మా జిల్లాల్లో సంచరించినట్లుగా జరిగిన పరిణామాలు, ఎన్‌కౌంటర్లను బట్టి స్పష్టమైంది. అయితే మావోయిస్టులు చత్తీస్‌గఢ్ నుంచి పరిసర ప్రాంత రాష్ట్రాలకు వలస పోయారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

Read Also- Bunny Vas: టాలీవుడ్‌లో చాలా రూల్స్ ఉన్నాయ్.. కానీ పాటించడమే అసాధ్యం! బన్నీ వాస్ షాకింగ్ కామెంట్స్

తాడ్వాయి మండలంలో ఆదివాసీ సంఘం పేరిట పోస్టర్లు
ఇటీవల ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి, ఊరట్టం, బయ్యక్కపేటలలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం పేరిట వెలిసిన పోస్టర్లు.. మావోయిస్టుల సంచరాన్ని తేటతెల్లం చేస్తున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లలోని సారాంశాన్ని పరిశీలిస్తే,
‘ప్రజాస్వామ్య బద్ధమైన శాంతియుత జీవనం మన హక్కు’ అని ఆదివాసి యువజన సంఘం పేరిట మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిచాయి. గత 20 సంవత్సరాలుగా నక్సలైట్లు మావోయిస్టుల సంచారం లేకపోవడంతో తెలంగాణ పల్లెలు, ఆదివాసీ గూడేలు ఎంతో అభివృద్ధి చెందడమే కాకుండా ఒక ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఎవరి జీవితాన్ని వారు సంతోషంగా గడుపుతున్నారని పోస్టర్లలో పేర్కొన్నారు. 20 సంవత్సరాలకు ముందు పరిస్థితులు చూస్తే కొన్ని దశాబ్దాల పాటు నక్సలైట్లు, మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక ఆదివాసి బిడ్డలను అడ్డం పెట్టుకొని వారి ఉనికిని చాటుకోవడం కోసం సహకరించని అమాయక ప్రజలను ముఖ్యంగా ఆదివాసి బిడ్డలను చంపుకుంటూ విధ్వంసానికి పాల్పడ్డారని వివరించారు. ఆదివాసి బిడ్డల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులకు ప్రజలు సహకరించకపోవడంతో చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు వలస పోయారని తెలిపారు.

Read Also- EU Chief Plane – Russia: ఈయూ చీఫ్ టార్గెట్‌గా ఎయిర్‌పోర్టులో జీపీఎస్‌ను జామ్ చేసిన రష్యా?

చత్తీస్‌గఢ్ రాష్ట్రం సహా ఇతర ప్రాంతాల్లో కూడా మావోయిస్టుల ఆగడాలను పసిగట్టిన ప్రజలు వారి మోసపూరిత చర్యలను ఎండగడుతూ వారికి సహాయ నిరాకరణ చేస్తుండడంతో చత్తీస్‌గఢ్‌లో కూడా మనుగడ కష్టమవుతుంది. మావోయిస్టులు గత్యంతరం లేక ఈ మధ్యకాలంలో మళ్లీ తిరిగి తెలంగాణలోకి వచ్చి వారి మనుగడను తిరిగి కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసి గూడేలలో సంచరిస్తే మనకు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలిసికూడా మనం మావోయిస్టులకు సాయం చేస్తే తెలంగాణ గ్రామాల్లో ముఖ్యంగా ఆదివాసి గుండెల్లో మళ్లీ హింస పెరుగుతుందని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టులకు సహకరిస్తే మన ప్రాంత అభివృద్ధి ఆగిపోవడమే కాకుండా ఆదివాసి యువత అభివృద్ధికి కూడా తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని లేఖలో పొందుపరిచారు. మావోయిస్టుల వల్ల గతంలో ఆదివాసీలకు ఒరిగింది లేదు… ప్రస్తుతం సహకరిస్తే ఒరిగేది కూడా లేదు అంటూ పోస్టర్లలో వివరించారు. మావోయిస్టులు హింస మార్గం వీడి సాధారణ ప్రజా జీవితంలో రావాలని ప్రోత్సాహిద్దామని పేర్కొన్నారు. మావోయిస్టులు చేస్తున్న మోసపూరిత ప్రయత్నాలను తిప్పి కొట్టండి అని.. మన ఊరు, గ్రామాల అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు సురక్షితంగా ఉంచడం కోసం ఆదివాసీలంతా మావోయిస్టులకు సహాయ నిరాకరణ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం తక్షణమే చేద్దామని లేఖలో ఆదివాసి యువజన సంఘం పేరిట తాడ్వాయి మండలంలో పోస్టల్ వెలవడం గమనార్హం.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ