Harish Rao
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

PC Ghosh report: హరీష్​ రావుకు హైకోర్టులో చుక్కెదురు

PC Ghosh report: పీసీ ఘోష్ నివేదికను సవాలు చేస్తూ పిటిషన్‌పై విచారణ

అత్యవసర విచారణకు న్యాయస్థానం నో
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి నిరాకరణ

తెలంగాణ బ్యూరో, స్వేచ్చ: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్​ కమిషన్​ ఇచ్చిన నివేదికపై (PC Ghosh report) ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి హరీష్​ రావుకు చుక్కెదురైంది. పిటిషన్‌పై అత్యవసర వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించేదు. మధ్యంతర ఉత్తర్వులు జారీ కూడా జారీ చేయలేమని స్పష్టం చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్​ కమిషన్​ కొన్ని నెలలపాటు విచారణ జరిపి ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందజేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చ జరిపిన ప్రభుత్వం, చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇందులో భాగంగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​, మాజీ మంత్రి హరీష్​ రావు ఇద్దరూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్​ నివేదికను కొట్టి వేయాలంటూ పిటిషన్లలో పేర్కొన్నారు. అసెంబ్లీలో నివేదికను ప్రవేశ పెట్టకుండా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

Read Also- Lavanya Tripathi’s Movie: అథర్వ మురళి, లావణ్య త్రిపాఠిల గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

అసెంబ్లీలో నివేదికను ప్రవేశ పెట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటానికి నిరాకరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్ట్​ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనికి ఒక రోజు ముందు మాజీ మంత్రి హరీష్​ రావు మరోసారి హైకోర్టులో హౌస్​ మోషన్​ పిటిషన్ దాఖలు చేశారు. నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై హరీష్​ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అత్యవసర పిటిషన్‌గా పరిగణించి దీనిపై విచారణ జరపాలని కోరారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందని, అసెంబ్లీలో తీర్మానం చేయకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే, ఈ అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ నిర్ణయం తెలుసుకుని చెప్పాలని జీపీని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి (సెప్టెంబర్ 2) వాయిదా వేసింది.

Read Also- TPCC Mahesh Kumar Goud: కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం స్కామ్ సుస్పష్టం.. మామ అల్లుళ్ల వాటా ఎంతో తేలాలి.. టీపీసీసీ చీఫ్

కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికను కొట్టి వేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్​, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఛీఫ్​ జస్టిస్‌తో కూడిన బెంచ్ మంగళవారం​ విచారణ జరపనుంది. కేసును సీబీఐకి అప్పగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై వాదనలు కొనసాగనున్నాయి.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ